నాచగిరి ఈఓగా రంగాచారి
వర్గల్(గజ్వేల్): సుప్రసిద్ధమైన నాచగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన కార్యనిర్వహణాధికారిగా బెల్లంకొండ రంగాచారి నియమితులయ్యారు. గతంలో ఆయన నాచగిరిలో సీనియర్ అసిస్టెంట్‌గా సుదీర్ఘకాలం సేవలందించారు. తాజాగా మహబూబ్‌నగర్ జిల్లా మద్దిమడుగు ఆంజనేయస్వామి ఆలయ ఈఓగా పనిచేస్తూ ఇక్కడికి బదిలీ అయ్యారు. సోమవారం రాత్రి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు నిజామాబాద్ జిల్లా సహాయ కమిషనర్ విజయరామారావు ఇన్‌చార్జి ఈఓగా అదనపు బాధ్యతలు నిర్వహించారు.
క్రీడల్లో యువత రాణించాలి
కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్
హుస్నాబాద్‌రూరల్: గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. మంగళవారం కొత్తకొండ దేవాలయానికి వెళ్తూ మార్గమధ్యంలో మీర్జాపూర్ క్రాసింగ్ దగ్గర యువత క్రికెట్ ఆడుతుంటే ఆగి వారితో కాసేపు ముచ్చటించారు. అలాగే బ్యాట్ పట్టి ఉత్తేజ పరిచారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి చూపాలన్నారు. ఆయన వెంట బీజేపీ నాయకులు కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, లక్కిరెడ్డి తిరుమల, దొడ్డి శ్రీనివాస్, భూక్య సంపత్‌నాయక్ తదితరులు ఉన్నారు.
వేడుకగా కాట్రావుల పండుగ
నంగునూరు(సిద్దిపేట): పాడి, పంటలకు మూలాధారమైన గోవులు ఆరోగ్యంగా ఉంటే రైతు ఇంట సిరి, సంపదలకు కొదవ ఉండదు. అనాధిగా వస్తున్న ఆచారాన్ని నేటికి పాటిస్తూ మంగళవారం నంగునూరు రైతులు కాట్రావుల పండగ నిర్వహిస్తున్నారు. మకర సంక్రాతి పురస్కరించుకొని ఆవులు, గేదెలను కడిగి చక్కగా ముస్తాబు చేశారు. వ్యవసాయ బావి వద్ద పందిరి వేసి మట్టితో ఆవులు, గేదెలు, గోపాలుని ప్రతిమను తయారు చేసి గొడ్డు, గోదాను చల్లంగా చూడాలని పూజలు చేశారు. అనంతరం జీవాలను వ్యవసాయ బావి వద్దకు చేర్చి బెల్లం, కొత్త బియ్యంతో మట్టి కుండలో అన్నం వండి వాటి చుట్టు తిరుగుతూ నైవేద్యం సమర్పించి అక్కడే వన భోజనాలు చేశారు.
నాచగిరి ఈఓగా రంగాచారి
నాచగిరి ఈఓగా రంగాచారి


