డూడూ బసవన్నలు..
క్రీడలతో మంచి గుర్తింపు యువత క్రీడల్లోనూ రాణించి సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి సూచించారు. వివరాలు 9లో u
నంగునూరు(సిద్దిపేట): ‘అయ్యగారికి దండం పెట్టు.. అమ్మగారికి దండం పెట్టు.. పిల్ల, పాపల సల్లంగా చూడు బసవా’ అంటూ గంగిరెద్దుల ఆట, పాటలు పల్లెలు, పట్టణాల్లో సంక్రాంతి సంబరాలు కనువిందు చేస్తున్నాయి. పండగ వేళ బసవన్న తమ ఇంటికొచ్చాడనే ఆనందంతో మహిళలు ధనం, ధాన్యం ఇస్తూ ఉప్పొంగిపోతు న్నారు. అంతరించి పోతున్న కుల వృత్తులు, భాష, వేషం, జీవన శైలి మారినా సంప్రదాయంగా వస్తున్న కుల వృత్తినే నమ్ముకొని కొందరు గంగిరెద్దుల వారు జీవనం సాగిస్తున్నారు. నంగునూరు, ముండ్రాయి, గట్లమల్యాల, నాంచారుపల్లి, హుస్నా బాద్ మండలం ఆరేపల్లి, కొండాపూర్, బొమ్మనపల్లి, చేర్యాల మండలం ఆకునూర్, దుబ్బా క మండలం ధర్మాజీపేట, గ్రామాల్లో గింగిరెద్దుల వారు జీవనం సాగిస్తున్నారు. గ్రామ శివారుల్లో గుడిసెలు వేసుకొని మూడు రోజుల పాటు ఇంటింటా తిరుగుతూ సంక్రాంతి సంబరాలకు జీవం పోస్తున్నారు. అందంగా అలంకరించిన బసవన్నలు మహిళలు, చిన్నారులను దీవిస్తూ చేస్తున్న విన్యాసాలు అందరినీ అలరిస్తున్నాయి.
డూడూ బసవన్నలు..


