కాంగ్రెస్ నాయకత్వమే దేశానికి శ్రీరామరక్ష
డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి
గజ్వేల్: కాంగ్రెస్ నాయకత్వమే దేశానికి శ్రీరామ రక్ష అని డీసీసీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి అన్నారు. సోమవారం గజ్వేల్‌లో నిర్వహించిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ జన్మదిన వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుల, మతాల పేరిట బీజేపీ రాజకీయాలు చేస్తుండగా.. కాంగ్రెస్ దేశంలో శాంతి, పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్నదని చెప్పారు. ప్రియాంకగాంధీ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నిరంతరం పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ సర్ధార్‌ఖాన్, నాచారం ట్రస్ట్‌బోర్డు మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
ఉపాధి పథకం
పేరు మార్పు తగదు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): యథాతథంగా మహాత్మాగాంఽధీ ఉపాధి హామీ పథకం పేరును కొనసాగించాలని డీసీసీ ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్ అన్నారు. సోమవారం జిల్లాకు చెందిన పలువురికి సీఎం రిలీఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పేదల పార్టీ అని, అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు ఉపాధి హామీ పథకం పేరుతో పేదలకు గ్రామాలలో పని కల్పించారన్నారు. నేడు పథకానికి పేరు మార్చడం సరికాదన్నారు. గతంలో ఈ పథకానికి నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించేదని, కానీ ఇపుడు 40శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరించాలనడం తగదన్నారు. గతంలో గ్రామా పంచాయతీలకు ఉపాధి హామీ నిధులతో గ్రామంలో ఏదైనా అభివృద్ధి చేసుకునే వీలుండేదన్నారు. కార్యక్రమంలో గుండు వెంకట్, బర్ల స్వామి తదితరులు పాల్గొన్నారు.
యువతకు స్ఫూర్తి ప్రదాత వివేకానంద
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): యువతలో నిత్య చైతన్య స్ఫూర్తిని నింపిన మహనీయుడు స్వామి వివేకానంద అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మెదక్ విభాగ్ సహ కార్యవాహ బొల్లి నర్సింహులు అన్నారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం స్వామి వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ స్వామి వివేకానంద జీవిత చరిత్ర, రచనలు, ఉపన్యాసాలు జీవితాంతం సమాజ హిత పనులను చేయడానికి స్ఫూర్తిని కలిగిస్తాయన్నారు. నేటి విద్యార్థులే భవిష్యత్తు భారత నిర్మాతలని, వారిలో జాతీయ భావనను, సామాజిక భావనను నిర్మాణం చేయాల్సిన గురుతర బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. కార్యక్రమానికి తపస్ జిల్లా అధ్యక్షుడు చిలుమల మురళీధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సిరెడ్డి పాల్గొన్నారు.
జపాన్ సందర్శనకు
ఇర్కోడ్ విద్యార్థి
సిద్దిపేటరూరల్: ఇర్కోడ్ ఆదర్శ పాఠశాల విద్యార్థి సైన్స్ విజ్ఞాన పరీక్ష (సకుర)లో అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతో జపాన్ సందర్శనకు ఎంపికయ్యారు. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన పరీక్షలో విద్యార్థి వేణు ఎంపికై నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు. వేణు పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నారన్నారు. ప్రస్తుతం ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం బైపీసీ చదువుతున్నట్లు తెలిపారు. పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వేణు జపాన్ దేశ సందర్శనకు ఎంపిక కావడం ఎంతో సంతోషకరమన్నారు. డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం వేణుకు అభినందనలు తెలిపారు.
కాంగ్రెస్ నాయకత్వమే దేశానికి శ్రీరామరక్ష


