‘గిరి’ తన్మయం.. భక్తజన ప్రదక్షిణం
స్వాతి నక్షత్ర మహోత్సవంతో నాచగిరి క్షేత్రం అలరారింది. గిరి ప్రదక్షిణ సంరంభంతో హరిద్రాతీరం పరవశించింది. సోమవారం నేత్రపర్వంగా సాగిన లక్ష్మీనృసింహుని జన్మనక్షత్ర వేడుకలతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. శ్రీవారి జన్మనక్షత్రం సందర్భంగా ఉదయం పీఠాధిపతి మాధవానంద సరస్వతి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ మహోత్సవం ప్రారంభమైంది. ప్రముఖులు హాజరుకాగా, భక్తజన సందోహం హర్షధ్వానాలు, మిన్నంటిన నారసింహ స్మరణలతో గిరిప్రదక్షిణ సాగింది. పోటెత్తిన భక్తజనం నాచగిరి కొండలు చుడుతూ.. హరిద్రానది తీరం, గోశాలను దాటుతూ ఉత్తరద్వారం వరకు గిరి ప్రదక్షిణ చేసి భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.
గిరి ప్రదక్షిణలో భక్తజన సందోహం
– వర్గల్(గజ్వేల్)
‘గిరి’ తన్మయం.. భక్తజన ప్రదక్షిణం


