మంగళవారం శ్రీ 13 శ్రీ జనవరి శ్రీ 2026
న్యూస్‌రీల్
‘చెప్పు’కునేలా చేశారు
కలెక్టర్ చెప్పారు.. అధికారులు కదిలారు
గజ్వేల్: మల్లన్నసాగర్ నిర్వాసితుల కాలనీ (ఆర్‌అండ్‌ఆర్ కాలనీ) సమస్యలు ప్రతిబింబిస్తూ ‘సాక్షి’లో ప్రచురితమైన వరుస కథనాలపై కలెక్టర్ హైమావతి స్పందించారు. ఈనెల 9న ‘నిర్వాసితుల నెత్తిన విలీనం పిడుగు’ శీర్షికన, 10న ‘ఇళ్లు ఇక్కడ.. ఓట్లు అక్కడ’, 11న ‘నిర్వాసితుల చుట్టే మున్సిపోల్...తెరపైకి పెండింగ్ సమస్యలు’ వంటి ప్రత్యేక కథనాలు ప్రచురితమైన సంగతి తెల్సిందే. ఈమేరకు ముందుగా ఆర్థికేతర సమస్యలు వెంటనే పరిష్కరించడానికి కలెక్టర్ ముందుకుసాగుతున్నారు. ఇందుకు సంబంధించి సిద్దిపేట, గజ్వేల్ ఆర్డీఓలకు ఆదేశాలిచ్చారు. పెండింగ్‌లో ఉన్న ఇళ్ల స్థలాల సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని సూచించగా.. ఆయా నిర్వాసిత గ్రామాల్లో అర్హులుగా ఉండి.. ఇప్పటివరకు ఇళ్ల స్థలాలకు నోచుకోని వారి వివరాలను సేకరించారు. ఎర్రవల్లి, సింగారం గ్రామాలకు చెందినవారికి గజ్వేల్‌లో, మిగతా గ్రామాలవారికి సిద్దిపేట ఆర్‌డీఓ కార్యాలయం పరిధిలో ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్లను పూర్తి చేయడానికి సిద్ధమవుతున్నారు. మంగళవారం ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. నిధులతో కూడుకున్న పనులను సైతం త్వరలోనే పూర్తి చేయడానికి ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. ఇకపోతే ఆర్‌అండ్‌ఆర్ కాలనీకి సంబంధించి మున్సిపల్ వార్డుల విభజనలో దొర్లిన పొరపాట్లను సైతం సరిదిద్దడానికి అధికారులు చర్యలు చేపట్టారు.
మంగళవారం శ్రీ 13 శ్రీ జనవరి శ్రీ 2026
మంగళవారం శ్రీ 13 శ్రీ జనవరి శ్రీ 2026
మంగళవారం శ్రీ 13 శ్రీ జనవరి శ్రీ 2026
మంగళవారం శ్రీ 13 శ్రీ జనవరి శ్రీ 2026


