డ్రైవింగ్‌పై అవగాహన అవసరం | - | Sakshi
Sakshi News home page

డ్రైవింగ్‌పై అవగాహన అవసరం

Jan 31 2026 9:28 AM | Updated on Jan 31 2026 9:28 AM

డ్రైవింగ్‌పై అవగాహన అవసరం

డ్రైవింగ్‌పై అవగాహన అవసరం

సీపీ రష్మీ పెరుమాళ్‌

సీపీ రష్మీ పెరుమాళ్‌

సిద్దిపేటకమాన్‌: రోడ్డు ప్రమాదాల నివారణకు కేవలం జరిమానాలు మాత్రమే పరిష్కారం కాదని, ప్రతి ఒక్కరికి డ్రైవింగ్‌, నిబంధనలపై అవగాహన ఉండా లని సీపీ రష్మీ పెరుమాళ్‌ అన్నారు. రోడ్డు భద్రతపై చేపట్టిన ‘అరైవ్‌ అలైవ్‌’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సోషల్‌ మీడియా వీడియోల పోటీల్లో విజేతలకు సీపీ ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సామాజిక అంశాలపై అవగాహన కల్పించేందుకు యువత ముందుకు రావాలన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలన, మద్యపానం కలిగే వల్ల నష్టాలు, సైబర్‌ నేరాలపై షార్ట్‌ వీడియోల ద్వారా ప్రజల్లో మార్పు తీసుకరావడానికి యువత ముందుండాలన్నారు. అడిషనల్‌ డీసీపీ అడ్మిన్‌ కుశాల్కర్‌, సీఐలు వాసుదేవరావు, ఉపేందర్‌, లక్ష్మీబాబు, శ్రీధర్‌గౌడ్‌, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ సాయిప్రసాద్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement