మల్లన్న హుండీ ఆదాయం రూ.1.1 కోట్లు
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఖజానాకు 23రోజులలో హుండీల ద్వారా రూ.1.1 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి వెంకటేశ్ తెలిపారు. గురువారం హుండీల కానుకలను దేవాదాయ శాఖ సిద్దిపేట డివిజన్ ఇన్‌స్పెక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది, లలితసేవాసమితి సభ్యులు లెక్కించారు. ఈ సందర్భంగా నగదు రూ.1,01,24,258 రాగా, విదేశి కరెన్సీ 30, మిశ్రమ బంగారం 050 గ్రాములు, మిశ్రమ వెండి 5కిలోల 600 గ్రాములు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ధర్మకర్తలు, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


