తుపాకులు డిపాజిట్ చేయాలి: సీపీ రష్మీ
సిద్దిపేటకమాన్: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి నందున లైసెన్స్ తుపాకులు కలిగి ఉన్న వ్యక్తులు స్థానిక పోలీసు స్టేషన్లలో డిపాజిట్ చేయాలని సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 31 లోపు డిపాజి ట్ చేయాలన్నారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత తిరిగి నిబంధనల ప్రకారం తీసుకెళ్లవచ్చన్నారు. డిపాజిట్ చేయని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. హుస్నాబాద్, చేర్యాల, దుబ్బాక, గజ్వేల్ సరిహద్దుల్లో నాలుగు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి, 24 గంటలూ వాహనాల తనిఖీ నిర్వహిస్తామన్నారు.
అత్యుత్తమ సేవలే
గుర్తింపునిస్తాయి
మిరుదొడ్డి(దుబ్బాక): వృత్తి రీత్యా చేసిన అత్యుత్తమ సేవలే సమాజంలో మంచి గుర్తింపునిస్తాయని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. అక్బర్‌పేట–భూంపల్లి పీహెచ్‌సీ కేంద్రంలో మెడికల్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ అదీభా ఖురేషి సేవలకు జిల్లా స్థాయిలో ప్రశంసా పత్రాన్ని అందుకుంది. ఈ మేరకు డాక్టర్ అదీభా ఖురేషిని బుధవారం పీహెచ్‌సీలో శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలను అందిస్తూ పీహెచ్‌సీకి పేరును తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో భూంపల్లి సర్పంచ్ జెన్నారెడ్డి, పీహెచ్‌సీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి
ములుగు(గజ్వేల్): ప్రభుత్వం తక్షణమే ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని పీఆర్‌టీయూ టీఎస్ అధికార ప్రతినిధి వంగ మహేందర్‌రెడ్డి అన్నారు. ములుగు మండలం వంటిమామిడిలో బుధవారం నిర్వహించిన రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి ఉద్యోగ విరమణ సభకు ఆయన ముఖ్యతిథిగా హాజరై మాట్లాడారు. రిటైర్డ్, పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పెండింగ్ బిలుల్లు చెల్లించాలని, హెల్త్ కార్డులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, ప్రధానకార్యదర్శి శశిధర్‌శర్మ, క్షీరసాగర్ సర్పంచ్ కొన్యాల బాల్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
వెల్‌నెస్ సెంటర్‌లో
మందుల కొరత తీర్చండి
సిద్దిపేటకమాన్: సిద్దిపేట వెల్‌నెస్ సెంటర్‌లో మందుల కొరత తీర్చాలని ప్రభుత్వ పెన్షనర్ అసోసియేషన్ జిల్లా కమిటీ అధ్యక్షుడు నర్సింహులు కోరారు. అవసరమైన అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని పెన్షనర్లు సెంటర్ ఇన్‌చార్జి వైద్యాధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ వ్యాధులకు అవసరమైన మందులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. కార్యక్రమంలో తిరుపతి, రవిందర్, కృష్ణమూర్తి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కుక్కల పట్టివేత.. సర్పంచ్‌పై కేసు
దుబ్బాకరూరల్: అక్బర్‌పేట– భూంపల్లి మండలం బొప్పాపూర్‌లో వీధి కుక్కలు విచ్చలవిడిగా తిరగడంతో సర్పంచ్ వాటిని పట్టించారు. కుక్కలను మెటల్ వైరుతో బంధించి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో వదిలేశారు. అదులపురం గౌతమ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సర్పంచ్ భానుప్రసాద్, పంచాయతీ సిబ్బందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ హరిప్రసాద్ తెలిపారు.
తుపాకులు డిపాజిట్ చేయాలి: సీపీ రష్మీ
తుపాకులు డిపాజిట్ చేయాలి: సీపీ రష్మీ
తుపాకులు డిపాజిట్ చేయాలి: సీపీ రష్మీ


