ఎస్సీ మహిళకు చైర్ పర్సన్ పీఠం
చేర్యాల(సిద్దిపేట): త్వరలో జరగనున్న మున్సి పల్ ఎన్నికల నేపథ్యంలో శనివారం వార్డులతో పాటు చైర్ పర్సన్ రిజర్వేషన్లు ఖరారు చేశారు. మున్సిపల్ పరిధిలోని 12 వార్డులకు కలెక్టర్ కార్యాయంలో చేపట్టిన కార్యక్రమంలో రిజర్వేషన్లు ఖరారు చేయగా చైర్ పర్సన్ రిజర్వేషన్ మాత్రం హైదరాబాద్ సీడీఎంఏ కార్యాలయంలో నిర్ణయించారు. చేర్యాల వార్డుల వారీగా రిజర్వేషన్లు ఇలా.. 1వ వార్డు బీసీ మహిళ, 2వ వార్డు ఎస్సీ మహిళ, 3వ వార్డు జనరల్ మహిళ, 4వ వార్డు జనరల్ మహిళ, 5వ వార్డు జనరల్, 6వ వార్డు ఎస్సీ జనరల్, 7వ వార్డు బీసీ జనరల్, 8వ వార్డు ఎస్టీ జనరల్, 9వ వార్డు బీసీ జనరల్, 10వ వార్డు జనరల్ మహిళ, 11వ వార్డు జనరల్, 12వ వార్డు జనరల్ మహిళకు రిజర్వు చేశారు. ఇది ఇలా ఉండగా చేర్యాల మున్సిపల్ చైర్ పర్సన్ ఎస్సీ మహిళకు కేటాయించారు.
కోతుల బెడద
అరికట్టేందుకు తీర్మానం
హుస్నాబాద్‌రూరల్: మండలంలోని పందిల్లలో కోతుల బెడద నివారించడానికి గ్రామస్తులు తీర్మానం చేశారు. సర్పంచ్ రమేశ్ ఆధ్వర్యంలో శనివారం సమావేశం నిర్వహించారు. కోతులను పట్టించడానికి ప్రతి ఇంటి నుంచి విరాళాలు అందించాలని నిర్ణయించారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని సర్పంచ్ తెలిపారు.
రాష్ట్ర ఎస్సీ ఎస్టీ చైర్మన్
వెంకటయ్య పరామర్శ
మిరుదొడ్డి(దుబ్బాక): అక్బర్‌పేట–భూంపల్లి మండల కేంద్రంలో అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న కుమ్మరిరాజు, మంగళి చిన్న అంజయ్యను శనివారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పరామర్శించారు. మెరుగైన వైద్యం కోసం తన వంతు సహకారం అందిస్తానని వారికి భరోసా కల్పించారు. పరామర్శించిన వారిలో సర్పంచ్ లు జెన్నారెడ్డి, కుమార్, బాల మల్లేశం గౌడ్, వార్డు సభ్యులు ప్రవీణ్, కొండల్, నాగరాజు నాయకులు నందం తదితరులు ఉన్నారు.
పేదలను ఆదుకోవడమే లక్ష్యం
దుబ్బాకటౌన్: పేదలను ఆదుకోవడమే శ్రేష్ట ఫౌండేషన్ లక్ష్యమని ఆ ఫౌండేషన్ సీఈఓ కంకణాల ఏప్రాయిం అన్నారు. సర్పంచ్ పెరమండ్ల నర్సింహులుతో కలిసి శేరిపల్లి బందారంలో శనివారం వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ పేదలు, వృద్ధుల సంక్షేమా నికి ఫౌండేషన్ ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. చలికాలంలో ఇబ్బందులు పడకూడదనే ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పారు. ఉప సర్పంచ్ రాములు, వార్డు సభ్యులు, జోసెఫ్, భిక్షపతి, వాలంటీర్లు పాల్గొన్నారు.


