కార్యాలయం లేక కష్టాలు
● హెల్త్ సెంటర్లో నామినేషన్ల స్వీకరణ ● చేర్యాల మున్సిపాలిటీలో వింత పరిస్థితి
చేర్యాల(సిద్దిపేట): పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయినా సరైన వసతులు లేక చేర్యాలలో అధికారులకు, పాలకవర్గానికి తిప్పలు తప్పడంలేదు. మున్సిపల్ కార్యాలయం కొన్ని రోజులు పాత గ్రామ పంచాయతీ భవనంలోనే కొనసాగింది. తర్వాత చోటు చేసుకున్న పరిణామాల దృష్ట్యా పట్టణంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం పేరుతో కార్యాలయం కూల్చి వేశారు. దీంతో పట్టణ శివారులో ఉన్న ఎస్సీ హాస్టల్‌లోకి కార్యాలయాన్ని మార్చారు. ఇరుకు గదుల్లోనే ఉంటూ పట్టణ ప్రజలకు సేవలు అందించారు. ప్రస్తుత కార్యాలయంలో సరైన వసతులు లేకపోవడంతో పాత ప్రభుత్వ ఆస్పత్రిలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ చేపట్టారు. కొత్తగా కొలువుదీరే పాలవర్గంలోనైనా మున్సిపాలిటీకి సొంత భవనం ఏర్పాటు అయ్యేనా అన్న చర్చ పట్టణంలో జరుగుతోంది.


