సీఎం కప్‌తో గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం | - | Sakshi
Sakshi News home page

సీఎం కప్‌తో గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం

Jan 31 2026 9:28 AM | Updated on Jan 31 2026 9:28 AM

సీఎం కప్‌తో గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం

సీఎం కప్‌తో గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ వెంకటయ్య

మిరుదొడ్డి(దుబ్బాక): గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్‌ క్రీడా పోటీలు నిర్వహిస్తోందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ వెంకటయ్య అన్నారు. శుక్రవారం అక్బర్‌పేట–భూంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. 30 మంది క్రీడాకారులకు దుస్తులను అందజేసిన భూంపల్లి 2వ వార్డు సభ్యుడు కొండల్‌ను అభినందించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ రెహమాన్‌, ఎంపీడీఓ సోమిరెడ్డి, ఏఎంసీ చైర్‌పర్సన్‌ సంయుక్త, దుబ్బాక ఏఎంసీ చైర్మన్‌ రవి, సర్పంచ్‌లు జెన్నారెడ్డి, కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ములుగులో ముగిసిన క్రీడలు

ములుగు(గజ్వేల్‌): ములుగు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో రెండు రోజులుగా సాగిన మండలస్థాయి క్రీడా పోటీలు శుక్రవారంతో ముగిశాయి. కబడ్డీ, వాలీబాల్‌, కోకో, బాస్కెట్‌బాల్‌ క్రీడల్లో విజేతలకు అధికారులు, ప్రజాప్రతినిథులు బహుమతులను ప్రదానం చేశారు. ఎంపీడీఓ స్వర్ణకుమారి ఎంఈఓ ఉదయ్‌భాస్కర్‌రెడ్డి, ఎస్‌ఐ రఘుపతి, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు బాల్‌రెడ్డి, సర్పంచ్‌ కనుకయ్య తదితరులు పాల్గొన్నారు.

క్రీడలతోనే సంపూర్ణ ఆరోగ్యం, వికాసం

చేర్యాల(సిద్దిపేట): క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం, వికాసం కలుగుతాయని ఎంపీడీఓ ప్రణయ్‌కుమార్‌ అన్నారు. స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిర్వహించిన క్రీడోత్సవాలను ఎంఈఓ నరేందర్‌, ఎస్‌ఐ నవీన్‌తో కలిసి ప్రారంభించారు. పీడీలు రామేశ్వర్‌రెడ్డి, కిషన్‌, శ్రీధర్‌, కవిత, రజిత, రమేశ్‌, అరుణ, సురేశ్‌, సంతోష్‌, ఎంఆర్‌ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

నవోదయలో..

వర్గల్‌(గజ్వేల్‌): నవోదయ స్టేడియం వేదికగా వర్గల్‌లో ఆటల పోటీలు ఉత్సాహభరితంగా జరిగాయి. ఖోఖో, కబడ్డీ, వాలీబాల్‌ పోటీలలో క్రీడాకారులు సత్తాచాటారు. విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ దామోదర్‌రెడ్డి, తహసీల్దార్‌ రఘువీర్‌రెడ్డి, ఎంఈఓ సునీత, ప్రిన్సిపాల్‌ రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

మిరుదొడ్డిలో..

మిరుదొడ్డి(దుబ్బాక): క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు. తహసీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీఓ గంగుల గణేశ్‌రెడ్డి, ఎంఈఓ ప్రవీణ్‌బాబు, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ చైన్నె భూపాల్‌గౌడ్‌, ఇన్‌చార్జి ఎంపీఓ ఫహీం, సర్పంచ్‌ మహేశ్వరి, ఉప సర్పంచ్‌ కరుణాకర్‌, భైరయ్య, ఉపాధ్యాయులు రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement