● వేల సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ● రూ 299 కోట్ల విలువ చేసే ఉచిత బస్సు ప్రయాణం వినియోగం ● జెండాను ఆవిష్కరించిన కలెక్టర్‌ హైమావతి ● పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు | - | Sakshi
Sakshi News home page

● వేల సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ● రూ 299 కోట్ల విలువ చేసే ఉచిత బస్సు ప్రయాణం వినియోగం ● జెండాను ఆవిష్కరించిన కలెక్టర్‌ హైమావతి ● పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు

Jan 27 2026 9:32 AM | Updated on Jan 27 2026 9:32 AM

● వేల సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ● రూ 299 కోట్ల విల

● వేల సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ● రూ 299 కోట్ల విల

● వేల సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ● రూ 299 కోట్ల విలువ చేసే ఉచిత బస్సు ప్రయాణం వినియోగం ● జెండాను ఆవిష్కరించిన కలెక్టర్‌ హైమావతి ● పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు

సాక్షి, సిద్దిపేట: ప్రజాపాలన, పారదర్శక పాలనలో స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని కలెక్టర్‌ హైమావతి అన్నారు. పోలీసు కమిషనరేట్‌ ఆవరణలోని పెరేడ్‌ గ్రౌండ్‌లో సోమవారం ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. జాతీయ జెండాను కలెక్టర్‌ ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అందరి సహకారంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సులలో రూ 299.78కోట్ల విలువైన ఉచిత ప్రయాణం పథకంలో 7.89 కోట్ల మంది మహిళలు లబ్ధిపొందారని పేర్కొన్నారు. రాజీవ్‌ ఆరోగ్య శ్రీ ద్వారా రూ 77.56 కోట్లతో 26,481మందికి ఉచితంగా చికిత్స అందించినట్లు తెలిపారు.

9 వేల ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభం

బడుగు బలహీన వర్గాల సొంత ఇంటి కల సాకా రం దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఇంది రమ్మ ఇళ్ల పథకం ద్వారా జిల్లాలో 13,057 మంజూరయ్యాని కలెక్టర్‌ తెలిపారు. వాటిలో 9,079 మంది ఇళ్లు ప్రారంభమయ్యాయని, ఇప్పటి వరకు 110 ఇళ్లు పూర్తి కాగా వివిధ దశల్లో నిర్మాణం చేసుకున్న వారికి రూ183.39 కోట్లను అందించినట్లు వివరించారు. 1,79,860 మంది లబ్ధిదారులకు 7,53,962 సిలిండర్లను సబ్సిడీపై అందిచామన్నారు. 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్‌ను 2,03,611 గృహాలకు రూ 140 కోట్ల సబ్సిడీ ఇచ్చామన్నారు.

రైతు భరోసా

జిల్లాలో 2025–26 సంవత్సరం వానాకాలంలో మొత్తం 3.19 లక్షల మంది రైతులకు రూ 355 కోట్లను రైతు భరోసా కింద విడుదల చేశామని హైమావతి పేర్కొన్నారు. రైతు బీమా పథకం కింద 2025–26 సంవత్సరానికి 275 మంది రైతుల నామినీ ఖాతాలలో రూ13.75 కోట్లను జమ చేశామన్నారు. యాసంగి సీజన్‌కు 81,787 మెట్రిక్‌ టన్నుల ఎరువులు జిల్లాలో నిల్వలు ఉన్నాయని చెప్పారు. ఆయిల్‌పామ్‌ సాగు విస్తరణ జరుగుతుందని తెలిపారు. నాబార్డు,. రాష్ట్ర ప్రణాళిక సహకారంతో రూ.83.76కోట్లతో 6,520 ఎకరాలకు సాగునీరు అందించే దిశగా 19 చెక్‌ డ్యామ్‌ల నిర్మాణం చేపట్టినట్లు ఆమె వివరించారు.

సేంద్రియ ఎరువులతో ఆదాయం

పంచాయతీలలో ప్రతి ఇంటి నుంచి సేకరించిన తడి చెత్తతో 90,875 కిలోల సేంద్రియ ఎరువును తయా రు చేయగా.. రూ3.26లక్షల ఆదాయం వచ్చి ందని కలెక్టర్‌ తెలిపారు. అలాగే 1,04,854 కిలోల పొడి చెత్త విక్రయంతో రూ 3,01,866 ఆదాయం గ్రామ పంచాయతీలకు లభించింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో 14,909 స్వయం సహాయక సంఘాలకు రూ886 కోట్లను బ్యాంకు రుణాల లక్ష్యానికి గాను, ఇప్పటివరకు 10,080 సంఘాలకు రూ 839 కోట్ల రుణాలు అందించామని ఆమె వివరించారు.

గ్రామైక్య సంఘాలకు భవనాలు

జిల్లావ్యాప్తంగా 111 గ్రామైక్య సంఘ భవనాల నిర్మాణాలకు రూ11.10 కోట్లను మంజూరు చేసిన ట్లు హైమావతి తెలిపారు. 3,31,970 కుటుంబా లకు సన్న బియ్యాన్ని అందిస్తున్నామని చెప్పారు. వానాకాలంలో 3.57లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యంను రైతుల నుంచి కొనుగోలు చేశామన్నారు. ఆర్‌ అండ్‌ బీ ఆధ్వర్యంలో రూ 670 కోట్లతో 158.45 కి.మీ.ల రోడ్డు పనులు ప్రగతిలో ఉన్నాయి. పీఆర్‌ శాఖ రూ73.66కోట్లతో 793 సీసీ రోడ్లు మంజూరు కాగా 722 పూర్తి కాగా ఇంకా 71 పనులు ప్రగతిలో ఉన్నాయన్నారు. హాస్టళ్లలో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు, ఉపకార వేతనాలు అందిస్తున్నట్లు తెలిపారు.

కనువిప్పు కార్యక్రమం

పోలీస్‌ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో ‘కనువిప్పు’ కార్యక్రమం ద్వారా మాదకద్రవ్యాలు, సైబర్‌ నేరాలపై అవగాహన కల్పిస్తూ గంజాయి, మత్తు పదార్థాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. జిల్లాను మాదకద్రవ్య రహితంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌ సాధన రష్మీ పెరుమాళ్‌, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.

పోలీసుల గౌరవ వందనం

సిద్దిపేటరూరల్‌: 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్‌లో నిర్వ హించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్‌ హైమావతి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అధికారులు అంకితభావంతో పని చేయాలన్నారు. అంతకుముందుకలెక్టర్‌కు పోలీసులు గౌరవ వందనం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement