నోడల్ అధికారుల నియామకం
నాలుగు మున్సిపాలిటీలు.. 72 వార్డులు నేటి నుంచి 30వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ వచ్చే నెల 11న పోలింగ్, 13న కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
ఎన్నికల నిర్వహణకు 13 విభాగాలుగా విభజించి పది మంది నోడల్ అధికారులుగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హైమావతి నియమించారు. ఎన్నికల నిర్వహణకు సిబ్బంది నియామకానికి అధికారిగా డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి, ఎన్నికల సిబ్బందికి శిక్షణకు డీఆర్‌డీఓ జయదేవ్ ఆర్యా, బ్యాలెట్ బాక్స్‌లు, బ్యాలెట్ పేపర్లకు డీపీఓ రవీందర్, ట్రాన్స్‌పోర్టుకు డీటీఓ లక్ష్మణ్, మెటీరియల్ మేనేజ్‌మెంట్ జెడ్పీ సీఈఓ రమేశ్, అభ్యర్థుల ఎన్నికల ఖర్చు పరిశీలన డీసీఓ వరలక్ష్మి, నోడల్ అబ్జర్వర్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ విజయ్ భార్గవ్, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికా రిగా డీఆర్‌ఓ నాగరాజమ్మ, మీడియా కమ్యూనేషన్‌కు డీపీఆర్‌ఓ రవికుమార్, హెల్ప్‌లైన్ ఫిర్యా దులు ఏవో రాజ్‌కుమార్‌లను నియమించారు.
1.01 లక్షల మంది ఓటర్లు
నాలుగు మున్సిపాలిటీలలో 1,01,085 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళలు 52,110, పురుషులు 48,968, ఇతరులు ఏడుగురు ఉన్నారు.
మున్సిపాలిటీ వార్డులు మహిళలు పురుషులు ఇతరులు మొత్తం
హుస్నాబాద్ 20 9,873 9,348 06 19,227
దుబ్బాక 20 11.117 10,224 0 21,341
గజ్వేల్ 20 24,001 22,738 01 46,740
చేర్యాల 12 7,119 6,658 0 13,777
ఆయా మున్సిపాలిటీలలో బుధవారం కమిషనర్లు ఎన్నికల నోటిఫికేషన్లను విడుదల చేయనున్నారు. బుధవారం నుంచి 30వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 31న పరిశీలన, ఫిబ్రవరి 3వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉండనుంది. 11న ఎన్నికలు, 13న ఓట్ల లెక్కింపు, 16న మున్సిపల్ చైర్మన్‌ను ఎన్నుకోనున్నారు.
176 పోలింగ్ స్టేషన్లు
నాలుగు మున్సిపాలిటీలలో 176 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఎన్నికల నిర్వహణకు పీఓలు 210, ఏపీఓలు 210, ఓపీవోలు 420 మందిని నియమించారు. బ్యాలెట్ బాక్స్‌లను 422 సిద్ధం చేసి అందుబాటులో ఉంచారు. అలాగే నాలుగు కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూం ఏర్పాటుకు ఎంపిక చేశారు. వాటిలో ఏర్పాట్లు చేయనున్నారు.
ప్రచారానికి ఆరు రోజులే..
ఫిబ్రవరి 3న విత్ డ్రాలు, అదే రోజు అభ్యర్థులకు గుర్తులను కేటాయించనున్నారు. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో48 గంటలు(రెండు రోజుల) ముందే ప్రచారం బంద్ అవుతుంది. దీంతో అభ్యర్థులకు కేవలం ఆరు రోజులు మాత్రమే ప్రచారం చేయాల్సి ఉంటుంది. దీంతో నాయకుల్లో ఆందోళన నెలకొంది.
చేర్యాలలోని హెల్త్ సెంటర్‌లో
నామినేషన్ల స్వీకరణ
చేర్యాల మున్సిపాలిటీ ఇరుకు భవనంలో కొనసాగుతుండటంతో నామినేషన్ల స్వీకరణకు ఇబ్బందులు ఏర్పడే అవకాశాలున్నాయి. దీంతో స్థానిక పాత కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. మిగతా మున్సిపాలిటీలు గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్ కార్యాలయాల్లోనే నామినేషన్లను స్వీకరించనున్నారు. మున్సిపల్ కమిషనర్లు నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు. నామినేషన్ల స్వీకరణకు నాలుగు మున్సిపాలిటీలకు ఆర్వోలు 44, ఏఆర్వోలు 44 మందిని నియమించారు. వీరికి శిక్షణ సైతం పూర్తి అయింది.


