హుస్నాబాద్‌కు కొత్త సొబగులు
డివైడర్ల మధ్య ఆకర్షించే క్రీడాకారుల విగ్రహాలు
● సుందరీకరణ దిశగా పట్టణం ● డివైడర్ల మధ్య క్రీడాకారుల విగ్రహాలు ● మరింత వన్నె తెచ్చేలా ఏర్పాట్లు
హుస్నాబాద్: సుందరీకరణలో భాగంగా పట్టణానికి మరింత వన్నె తీసుకువస్తున్నారు. డివైడర్ల మధ్య ఏర్పాటు చేస్తున్న క్రీడాకారుల విగ్రహాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. హుస్నాబాద్ పట్టణంలోని నేషనల్ హైవే రోడ్‌లో మల్లెచెట్టు చౌరస్తా వరకు వివిధ క్రీడలకు సంబంధించిన క్రీడాకారుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. తొందరలోనే అంబేడ్కర్ చౌరస్తా నుంచి పోతారం (ఎస్) వరకు సూర్య నమస్కారాలు, యోగాసనాల విగ్రహాలు ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు. విగ్రహాలను సిరిసిల్ల నుంచి తెస్తున్నారు. రూ.80 లక్షల వ్యయంతో విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్, హ్యాండ్ బాల్, హాకి, రన్నింగ్ క్రీడాకారుల విగ్రహాలతో పాటు వెల్‌కమ్ స్టాచ్యూలను పట్టణ ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. బీటీ నుంచి మూడు ఫీట్ల ఎత్తు వరకు డివైడర్లను నిర్మించనున్నారు. ఇప్పటికే ప్రధాన కూడళ్లల్లో బ్యూటిఫికేషన్‌లో భాగంగా 5 ప్రధాన కూడళ్లల్లో వాటర్ ఫౌంటెన్‌తో జంక్షన్లు ఏర్పాటు చేసి సుందరీకరించారు. పట్టణానికి నాలుగు వై పులా రూ.1.20 కోట్లతో వెల్‌కమ్ హుస్నాబాద్ ఆర్చీలను ఏర్పాటు చేయనున్నారు.
అలాగే రూ.5 కోట్లతో మల్లెచెట్టు చౌరస్తా నుంచి పోలీస్ స్టేషన్ మీదుగా ఎల్లమ్మ చెరువు కట్ట వరకు నాలుగు వరుసల రహదారి పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులు పూర్తి కాగానే సెంట్రల్ డివైడర్ నిర్మాణంతో పాటుగా సెంట్రల్ లైటింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసి పట్టణ రూపు రేఖలను మార్చనున్నారు. అలాగే ఎల్లమ్మ చెరువును రూ.18 కోట్లతో సుందరీకరణ పనులు ప్రారంభమయ్యాయి. కట్ట మధ్యన ఆకర్షించే బొమ్మలు, చెరువు మధ్య గాజు వంతెన హైలెట్‌గా నిలువనుంది. బతుకమ్మ ఘాట్ పనులు పూర్తి చేశారు.
హుస్నాబాద్‌కు కొత్త సొబగులు
హుస్నాబాద్‌కు కొత్త సొబగులు


