రక్షణ చట్టం తేవాల్సిందే | - | Sakshi
Sakshi News home page

రక్షణ చట్టం తేవాల్సిందే

Jan 28 2026 9:59 AM | Updated on Jan 28 2026 9:59 AM

రక్షణ

రక్షణ చట్టం తేవాల్సిందే

కోర్టు ఎదుట న్యాయవాదుల నిరసన

హుస్నాబాద్‌: దాడులు జరగకుండా న్యాయవాదుల రక్షణ చట్టం తేవాలని బార్‌ అసోసియేషన్‌ సభ్యులు డిమాండ్‌ చేశారు. సిద్దిపేటలో న్యాయవాదిపై జరిగిన దాడిని ఖండిస్తూ మంగళవారం విధులు బహిష్కరించి హుస్నాబాద్‌ కోర్టు ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయవాదులపై దాడులు పెరుగుతున్నాయని, రక్షణ కరువైందన్నారు. నిందితుడిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి శిక్షించాలని డిమాండ్‌ చేశారు. దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, న్యాయవాదులు తదితరులు ఉన్నారు.

విద్యుత్‌ సమస్యలా..?

1912కి ఫోన్‌ చేయండి

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): విద్యుత్‌ సమస్యలుంటే విద్యుత్‌శాఖ టోల్‌ఫ్రీ నంబర్‌ 1912కు కాల్‌ చేయాలని డీఈ రామచంద్రయ్య మంగళవారం తెలిపారు. సిద్దిపేట డివిజన్‌లో ఎక్కడ సమస్యలున్నా.. కాల్‌ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. విద్యుత్‌ అధికారుల అనుమతి లేకుండా వినియోగదారులు ట్రాన్స్‌ఫార్మర్‌ వద్దకు వెళ్లొద్దని, ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచించారు. ఎలాంటి సమస్యలున్నా విద్యుత్‌ అధికారులకు సమాచారం అందించాలన్నారు.

ఆయిల్‌పామ్‌ సాగుతో బోలెడు లాభాలు

కొమురవెల్లి(సిద్దిపేట): ఆయిల్‌పామ్‌ సాగుతో బోలెడు లాభాలు పొందవచ్చని, రైతులు సాగుకు ముందుకు రావాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి జి.సువర్ణ సూచించారు. మంగళవారం మండలంలోని మర్రిముచ్చాలలో ఆయిల్‌పామ్‌ తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంట ఒక్కసారి సాగు చేస్తే 30 ఏళ్ల వరకు దిగుబడి వస్తుందన్నారు. మొదటి మూడేళ్లు అంతర పంటల ద్వారా రైతులకు ఆదాయం సమకూరుతుందని తెలిపారు. అదే విధంగా కచ్చితమైన మార్కెట్‌ సదుపాయం ఉండడం వల్ల రైతులకు లాభదాయకంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఆయిల్‌ఫెడ్‌ అధికారి భాస్కర్‌రెడ్డి, మండల ఉద్యాన అధికారిని కౌసల్య తదితరులు పాల్గొన్నారు.

సెంట్రింగ్‌ పనులు బంద్‌

గజ్వేల్‌రూరల్‌: సెంట్రింగ్‌ కార్మికులు తమకు గిట్టుబాటు కూలీ రావడం లేదంటూ ధరలను పెంచే వరకు పనులు బంద్‌ చేస్తున్నట్లు గజ్వేల్‌ సెంట్రింగ్‌ సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం పట్టణంలోని ప్రధాన వీధుల్లో ర్యాలీ చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న ధరలతో కూలీ డబ్బులు గిట్టుబాటు కాకపోవడంతో కుటుంబాలను నెట్టుకురాలేక దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. సెంట్రింగ్‌ కార్మికులు హెల్త్‌ కార్డులు అందించాలని, కార్మికుల హక్కులు అమలయ్యేంతవరకు పనులను చేపట్టబోమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆదర్శ మిల్లర్స్‌ అసోసియేషన్‌ సభ్యులతో పాటు వివిధ సెంట్రింగ్‌ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

బృందావనంలో వేడుకలు

వర్గల్‌(గజ్వేల్‌): నాచగిరి రాఘవేంద్ర బృందావనంలో మంగళవారం మధ్వనవమి వేడుకలు ఘనంగా జరిగా యి. ఈ సందర్భంగా రాఘవేంద్రస్వామివారి సన్నిధిలో తెలంగాణ మధ్వమండలి ఆధ్వర్యంలో అర్చక వేదపండితులు ఉదయం సుప్రభాతం, పతాకావిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రవచనం, రథోత్సవం వైభవంగా చేపట్టారు. భక్తులకు ప్రసాద వితరణ చేశారు. గాడిచర్ల మదన్‌మోహన్‌రావు, ఉపేందర్‌రావు, గోవర్ధన్‌రావు తదితర మధ్వమండలి ప్రతినిధులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా బృందావనంలో భక్తిపారవశ్యం నెలకొంది.

రక్షణ చట్టం తేవాల్సిందే 1
1/2

రక్షణ చట్టం తేవాల్సిందే

రక్షణ చట్టం తేవాల్సిందే 2
2/2

రక్షణ చట్టం తేవాల్సిందే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement