కక్షగట్టి 20 కేసులు పెట్టించిండ్రు
దుబ్బాకపై నాకున్న ప్రేమప్రభాకర్‌రెడ్డికి ఉందా?
ఈ సారి మున్సిపల్‌పై కాషాయజెండా ఎగరాల్సిందే
ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు
దుబ్బాక: ‘రాజకీయంగా భిక్షపెట్టిన ఈ గడ్డపై నాకున్న ప్రేమ.. ప్రభాకర్‌రెడ్డికి ఉందా?, దుబ్బాక ఉప ఎన్నికలో నేను ఎమ్మెల్యేగా గెలిచాక కక్షగట్టి నాపై 20 కేసులు పెట్టించారని, అయినా భయపడలేదని, తెగించి ధైర్యంగా ఎదుర్కొన్నా’నని ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు తెలిపారు. శనివారం దుబ్బాక పట్టణంలోని 15, 16, 19, 20 వార్డులలో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ఇంటింటా ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా ప్రభాకర్‌రెడ్డి గెలిచి దుబ్బాకకు ఏం చేశారని, ప్రజలు ఆలోచించాలన్నారు. బీఆర్‌ఎస్ మున్సిపల్‌లో గెలిస్తే మళ్లీ పరాయి పెత్తనం కింద ఉంటుందని అందుకే ఈ సారి బీజేపీకి పట్టం కట్టలన్నారు. దుబ్బాకపై సిద్దిపేట పెత్తనం ఎందుకని మొదటి నుంచి తాను ప్రశ్నిస్తున్నానని అన్నారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో దుబ్బాక అభివృద్ధి చెందలేదని, రెవెన్యూ డివిజన్ చేయలేదన్నారు. మున్సిపల్ ఎన్నికలను తాను ఛాలెంజ్‌గా తీసుకొని బీజేపీ అభ్యర్థులను గెలిపించుకుంటానన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు.
ఆధారాలున్నా అరెస్ట్ చేయరేం
● ఫోన్ ట్యాపింగ్‌లో స్పష్టమైన ఆధారాలున్నా ప్రభుత్వం, సిట్ ఏం చేస్తుందని, ఎందుకు అరెస్ట్ చేయడంలేదని ఎంపీ ప్రశ్నించారు.
● కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఒక్క బీఆర్‌ఎస్ నాయకుడి అవినీతిని వెలికితీసింది లేదు.. అరెస్ట్ చేసింది లేదన్నారు.
● బావ, బామ్మర్దులు రెచ్చిపోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్‌కు చేతకాకపోతే వచ్చేది మేమే అప్పుడు తప్పకుండా చూస్తామంటూ రఘునందన్‌రావు అన్నారు.


