ఢీ
న్యూస్‌రీల్
పట్టుకోసం
బీజేపీ
ఫోకస్
ఇంటింటి ప్రచారం ప్రారంభించినబీఆర్‌ఎస్
ఆదివారం శ్రీ 25 శ్రీ జనవరి శ్రీ 2026
మున్సిపాలిటీల్లో పొలిటికల్ స్పీడ్
శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో కాంగ్రెస్
రాజకీయ వే
సాక్షి, సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు స్పీడ్ పెంచాయి. జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే మున్సిపాలిటీల రిజర్వేషన్లను మున్సిపల్ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలో ఎన్నికల షెడ్యుల్ విడుదల కానుండటంతో బీఆర్‌ఎస్, బీజేపీ ఇంటింటి ప్రచారాన్ని ఇప్పటికే ప్రారంభించగా అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఇలా మూడు పార్టీలు రాజకీయ వేడిని రగిలిస్తున్నాయి.
జోరు పెంచిన కారు
మున్సిపాలిటీలపై బీఆర్‌ఎస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా నేతలు అడుగులు వేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందే హుస్నాబాద్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. చేర్యాల పట్టణంలో ముఖ్యకార్యకర్తలతో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. అలాగే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయలేదంటూ బాకీ కార్డులను ప్రజలకు అందిస్తున్నారు. కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. దుబ్బాక పట్టణంలో సన్నాహక సమావేశాన్ని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నిర్వహించారు. గజ్వేల్ పట్టణంలో ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి, బీఆర్‌ఎస్ నేతలు ప్రతాప్ రెడ్డి, రాధకృష్ణ శర్మలు ముఖ్యకార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
విజయసంకల్ప సభలతో..
మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. గత సర్పంచ్ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవం మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకు ముందస్తుగానే పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతున్నారు. నాలుగు మున్సిపాలిటీలలో విజయసంకల్ప సమావేశాలను నిర్వహిస్తూ కార్యకర్తల్లో జోష్ నింపుతోంది. అలాగే దుబ్బాక పట్టణంలో ఇంటింటి ప్రచారాన్ని మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాదవనేని రఘునందన్‌రావు, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరీ శంకర్‌లు నిర్వహించారు. మున్సిపాలిటీలలో అభ్యర్థుల ఎంపిక కోసం త్రీమెన్ కమిటీలను ఏర్పాటు చేశారు.
అభివృద్ధి పనులతో..
పట్టణాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని ముందస్తుగానే పలు ప్రారంభోత్సవాలను ఇన్‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, మంత్రి పొన్నం ప్రభాకర్‌లు వేరు వేరుగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. వీబీ జీ రామ్ జీ బిల్లును రద్దు చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి ఆధ్వర్యంలో ఉపాధి కూలీలలో సమావేశాలను నిర్వహిస్తున్నారు. పట్టణాల్లో మహిళా సంఘాలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తూ వారికి దగ్గరయ్యే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది.
ఢీ
ఢీ
ఢీ


