వన దేవతల ఆగమనం.. పోటెత్తిన భక్తజనం
నంగునూరు మండలం అక్కెనపల్లిలోని సమ్మక్క సారలమ్మ ఆలయానికి గురువారం భక్తులు పోటెత్తారు. శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్లతో పులిగుండ్ల నుంచి సమ్మక్క ప్రతిమను తెచ్చి పూజారులు గద్దైపె ప్రతిష్ఠించారు. భక్తులు అమ్మవార్లకు బంగారాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. మహిళలు సమ్మక్క, సారమ్మకు ఒడి బియ్యం పోసి నైవేద్యం సమర్పించారు. ఎమ్మెల్యే హరీశ్‌రావు పూజలు చేసి అమ్మవారికి బంగారాన్ని(బెల్లం) సమర్పించారు. – నంగునూరు(సిద్దిపేట)
సమ్మక్క గద్దె వద్ద భక్తజనం
వన దేవతల ఆగమనం.. పోటెత్తిన భక్తజనం
వన దేవతల ఆగమనం.. పోటెత్తిన భక్తజనం


