రహదారి భద్రత అందరి బాధ్యత
సీపీ రష్మి పెరుమాళ్
తొగుట(దుబ్బాక): రహదారి భద్రతను ప్రతి ఒక్కరి బాధ్యత అని సీపీ రష్మి పెరుమాళ్ అన్నారు. మండల పరిధిలోని పెద్దమాసాన్ పల్లిలో గురువారం ‘అరైవ్ అలైవ్’అనే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ ప్రవీణ్ కుమార్‌రెడ్డి సౌజన్యంతో 100 మందికి ఉచితంగా హెల్మెట్లు అందజేశారు. గ్రామస్తులతో నేరుగా ముచ్చటించారు. రహదారి భద్రతపై వారికి ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రహదారి నిబంధనలను పాటిస్తేనే విలువైన ప్రాణాలు దక్కుతాయన్నారు. కార్యక్రమంలో గజ్వేల్ ఏసీపీ నర్సింహులు, తొగుట సీఐ లతీఫ్, ఎస్‌ఐ రవికాంత్, తదితరులు పాల్గొన్నారు.


