‘పట్నం వారం’ ఆదాయం రూ.75లక్షలు
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఆలయంలో పట్నం వారం (మొదటి ఆదివారం) పురస్కరించుకుని మూడు రోజుల ఆదాయం రూ.75,81,241 వచ్చినట్లు ఆలయ అధికారులు మంగళవారం తెలిపారు. భక్తులు స్వామివారికి వివిధ రకాల మొక్కులు, దర్శనాలు, లడ్డూ ప్రసాదం తదితర ద్వారా ఈ ఆదాయం సమకూరిందన్నారు. గత ఏడాది పట్నం వారానికి రూ.61,81,228 సమకూరగా.. ఈసారి రూ.14లక్షలు అధికంగా వచ్చినట్లు ఆలయ అధికారి మాధవి తెలిపారు.
పొట్లపల్లిలో
నాగ బోనం శిల్పం
హుస్నాబాద్ రూరల్: మండల పరిధి పొట్లపల్లి సమ్మక్కల గద్దెల వద్ద తెలంగాణ కొత్త చరిత్ర బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ నాగ బోనం శిల్పాన్ని గుర్తించారు. మంగళవారం పొట్లపల్లిలో సమ్మక్క గద్దెల ప్రాంతంలోని శిల్పాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోనం ఎత్తడం పోచమ్మ, కాటమయ్యలకే కాకుండా నాగ బోనాలు కూడా ఉంటాయని ఈ శిల్పాల ద్వారా తెలుస్తోందన్నారు. నాగ శిల్పాలు రాష్ట్రకూటుల కాలం నాటివిగా చర్రిత కారులు చెబుతున్నారని తెలిపారు.


