బీఆర్‌ఎస్‌ నాయకుల ధర్నా | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ నాయకుల ధర్నా

Jan 30 2026 8:48 AM | Updated on Jan 30 2026 8:48 AM

బీఆర్‌ఎస్‌ నాయకుల ధర్నా

బీఆర్‌ఎస్‌ నాయకుల ధర్నా

సిద్దిపేట పట్టణంలో ధర్నా చేస్తున్న బీఆర్‌ఎస్‌ నాయకులు

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): మాజీ సీఎం కేసీఆర్‌కు రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ నోటీసులు పంపడం సరికాదని బీఆర్‌ఎస్‌ నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు గురువారం జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన కేసీఆర్‌కు సిట్‌ నోటీసులు పంపడం తగదన్నారు. అనంతరం సీఎం ఫ్లెక్సీని దగ్ధం చేయడానికి ప్రయత్నించగా, పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో స్వల్పంగా తోపులాట చోటు చేసుకుంది. ఈ ధర్నాలో బీఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్వీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement