పట్నం వారం.. పనులు వేగిరం
రేపటి నుంచే కొమురవెల్లి మల్లన్న జాతర ● భారీగా తరలిరానున్న భక్తులు
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్న జాతర బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. జాతరలో మొదటి ఆదివారం హైదరాబాద్ నుంచి భక్తులు ఎక్కువగా తరలివస్తుండటంతో పట్నం వారంగా పిలుస్తారు. ఇందుకోసం ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూ కాంప్లెక్స్ ముందు భాగంలో తాత్కాలిక క్యూలైన్లు, చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. పార్కింగ్ ప్రదేశాలలో మంచి నీటి వసతి, భక్తులకు కావాల్సిన లడ్డూలను సిద్ధం చేశారు. సోమవారం హైదరాబాద్‌కు చెందిన మాణిక్యం, పోచయ్య కుటుంబ సభ్యులు పెద్ద పట్నం వేసి అగ్నిగుండాలు నిర్వహించే ఆనవాయితీ. ఇందుకు తోట బావి ప్రాంగణంలో ఏర్పాట్లను వేగిరంగా జరుగుతున్నాయి.
పట్నం వారం.. పనులు వేగిరం


