కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడతాం
గజ్వేల్: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి.. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేస్తామని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, బీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. గురువారం గజ్వేల్‌లో నిర్వహించిన పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఒరిగిందేమీలేదన్నారు. ప్రత్యేకించి గజ్వేల్ నియోజకవర్గానికి కొత్త పనులు రాకపోగా.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన రూ.180కోట్ల నిధులను రద్దు చేశారని ఆరోపించారు. కేసీఆర్ చొరవ వల్లే గజ్వేల్ అభివృద్ధిలో ముందుకెళ్లిందని చెప్పారు. ప్రత్యేకించి స్థానిక మున్సిపాలిటీ రాష్ట్రానికే నమునాగా మారిందన్నారు. ఇదే విషయాన్ని ప్రజలకు వివరించి మున్సిపాలిటీలో అత్యధిక మెజార్టీతో అభ్యర్థులను గెలిపిస్తామన్నారు. కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. సమావేశంలో మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు రాధాకృష్ణశర్మ, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎన్‌సీ రాజమౌళి, వైస్ చైర్మన్ జకీయొద్దీన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ మల్లేశం, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


