నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు కీలకం
త్రీటౌన్ సీఐ లక్ష్మీబాబు
సిద్దిపేటఅర్బన్: నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో కీలకంగా మారాయని, ముఖ్యమైన ప్రదేశాలు, ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని త్రీటౌన్ సీఐ లక్ష్మీబాబు పిలుపునిచ్చారు. అర్బన్ మండలం పొన్నాలలో సర్పంచ్ అమ్ముల వెంకటయ్య అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. సైబర్ నేరాలు, సీసీ కెమెరాల ప్రాముఖ్యత, రోడ్డు ప్రమాదాల నివారణ గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించా రు. అంతకు ముందు గ్రామసభలో పలు తీర్మానాలు చేశారు. సీసీ కెమెరాల ఏర్పాటు, పోలీస్ కన్వెన్షన్ హాల్, పెట్రోల్ బంక్‌లకు పంచాయతీ అసెస్మెంట్ చేసి పన్నులు వసూలు చేయాలని, మల్టీపర్పస్ వర్కర్లు అందుబాటులో ఉండాలని, ఇంటి పన్నులు ఎప్పటికప్పుడు సక్రమంగా వసూలు చేయాలని తీర్మానించారు. సర్పంచ్ వెంకటయ్య, కార్యదర్శి నరేశ్, ఉప సర్పంచ్ సృజన, మాజీ స ర్పంచ్ తన్నీరు శ్రీనివాస్, యాదగిరి, బాల్‌రంగం, సంపత్‌యాదవ్, శ్రావణ్, ఏఈఓ మీరాబాయి తదితరులు పాల్గొన్నారు.
మానవ తప్పిదాల వల్లే ప్రమాదాలు
వర్గల్(గజ్వేల్): మానవ తప్పిదాల వల్లే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని గజ్వేల్ ట్రాఫిక్ సీఐ మురళి అన్నారు. మండలంలోని గోవిందాపూర్‌లో ‘అరైవ్.. అలైవ్’ కార్యక్రమంలో భాగంగా ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతిఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఎన్‌ఎస్‌ఎస్ కో ఆర్డినేటర్ రాజు తదితరులు పాల్గొన్నారు.


