మల్లన్నను దర్శించుకున్న ఉపలోకాయుక్త | - | Sakshi
Sakshi News home page

మల్లన్నను దర్శించుకున్న ఉపలోకాయుక్త

Feb 1 2026 10:39 AM | Updated on Feb 1 2026 10:39 AM

మల్లన

మల్లన్నను దర్శించుకున్న ఉపలోకాయుక్త

కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామిని శనివారం ఉపలోకాయుక్త జగ్జీవన్‌కుమార్‌ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాన్ని, శేష వస్త్రాలను అందించారు, కార్యక్రమంలో ఆలయ ఈఓ టంకశాల వెంకటేశ్‌, ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్‌ తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి

రవాణాశాఖ అధికారి లక్ష్మణ్‌

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): రహదారి భద్రత మనందరి బాధ్యత అని జిల్లా రవాణాశాఖ అధికారి లక్ష్మణ్‌ అన్నారు. జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలోని శ్రీవాణి పాఠశాలలో బడ్జెట్‌ స్కూల్స్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ వారి ఆధ్వర్యంలో రోడ్డు భద్రత వారోత్సవాల ముగింపు ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గులు, వ్యాసరచన, క్విజ్‌పోటీలు, ఉపన్యాస పోటీలలో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలన్నారు. కార్యక్రమంలో ఎంవీఐ శంకర్‌నారాయణ, ఎఎంవీఐ శ్రీకాంత్‌రెడ్డి, బడ్జెట్‌ స్కూల్స్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యం, కోశాధికారి శ్రీకాంత్‌, కార్యవర్గ సభ్యులు బాలకృష్ణ, సికిందర్‌, రవీందర్‌ రెడ్డి, వెంకటేష్‌, సురేష్‌ పాల్గొన్నారు.

బాలకార్మిక వ్యవస్థ

నిర్మూలనే ధ్యేయం

సీపీ సాధన రష్మీ పెరుమాళ్‌

సిద్దిపేటకమాన్‌: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనే ధ్యేయంగా ఆపరేషన్‌ స్మయిల్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సిద్దిపేట పోలీసు కమిషనర్‌ సాధన రష్మీ పెరుమాళ్‌ అన్నారు. వివిధ శాఖల సమన్వయంతో జిల్లాలో ఆపరేషన్‌ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని చెప్పారు. ప్రత్యేక డ్రైవ్‌లో 70మంది చిన్నారులను రక్షించినట్లు తెలిపారు. వీరిలో 52మంది బాలురు, 18మంది బాలికలు ఉన్నట్లు చెప్పారు. ఇతర రాష్ట్రాలకు చెందిన బాలకార్మికులు 49మందిని తిరిగి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చించినట్లు తెలిపారు. జిల్లాలోని ఇటుకబట్టీలు, బేకరీలు, హోటళ్లు, ఇతర వాణిజ్య సంస్థలో తనిఖీలు నిర్వహించి బాలకార్మికులను గుర్తించామని, వెట్టి చాకిరి నుంచి వారిని విముక్తి చేశామన్నారు. ఇప్పటివరకు 12మంది యజమానులపై కేసులు నమోదు చేశామన్నారు.

రేపు ప్రజావాణి రద్దు

సిద్దిపేటరూరల్‌: మున్సిపల్‌ ఎన్నికల విధుల కారణంగా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్‌ కె.హైమావతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపల్‌ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రజావాణి నిర్వహిస్తామని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

నేడు బీఆర్‌ఎస్‌ నిరసన

ఎమ్మెల్యే సునీతారెడ్డి

నర్సాపూర్‌: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సిట్‌ విచారణ పేరుతో నోటీసులు ఇచ్చి, దర్యాప్తునకు పిలవడం అత్యంత హేయమైన చర్యని నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ సాధకుడిగా, సీఎంగా రెండు పర్యాయాలు పనిచేసిన వ్యక్తిని దర్యాప్తునకు పిలవడం సరికాదన్నారు. ఇలాంటి చర్యలను ఖండిస్తూ ఆదివారం బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

మల్లన్నను దర్శించుకున్న ఉపలోకాయుక్త1
1/2

మల్లన్నను దర్శించుకున్న ఉపలోకాయుక్త

మల్లన్నను దర్శించుకున్న ఉపలోకాయుక్త2
2/2

మల్లన్నను దర్శించుకున్న ఉపలోకాయుక్త

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement