‘బంగారం’తో పొన్నం మొక్కులు
హుస్నాబాద్ పట్టణం ఎల్లమ్మ చెరువు వద్ద సమ్మక్క సారలమ్మ దేవతలను గురువారం మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
అమ్మవారికి బంగారం(బెల్లం) సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ప్రాంతమంతా సమృద్ధిగా వర్షాలతో పాడి పంటలతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
భవిష్యత్‌లో ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు అమలు చేసే శక్తిని ఇవ్వాలని అమ్మవార్లను కోరుకున్నట్లు మంత్రి తెలిపారు. కాగా సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు.
– హుస్నాబాద్


