గెజిటెడ్ సంతకాల కోసం పరుగులు
హుస్నాబాద్: కుల ధ్రువీకరణ పత్రంపై గెజిటెడ్ అధికారి సంతకం తప్పనిసరి అని నిబంధన పెట్టడంతో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు హైరానా పడ్డారు. మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. నామినేషన్ ఫారంలో తప్పొప్పులను సరిచూసుకున్నారు. ఫారంలో అన్ని అంశాలు పూరించినప్పటికీ, కుల ధ్రువీకరణ పత్రంపై గెజిటెడ్ అధికారితో సంతకం తప్పనిసరి అధికారులు సూచించారు. దీంతో అభ్యర్థులు అధికారుల వద్దకు పరుగులు తీశారు. సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ఇచ్చారు. హెచ్‌ఎంలు అందుబాటులో లేకపోవడంతో వివిధ శాఖల అధికారుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగాల్సి వచ్చింది.


