సాగులో సస్యరక్షణ తప్పనిసరి
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి స్వరూపరాణి
చిన్నకోడూరు(సిద్దిపేట): పంటల సాగులో రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి స్వరూప రాణి సూచించారు. శుక్రవారం చిన్నకోడూరు, రామంచ, గంగాపూర్ గ్రామాల్లో రైతులు సాగు చేస్తున్న వరి, మొక్కజొన్న పంటలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రసాయనిక ఎరువులు ఎకరానికి 48 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 16 కిలోల పోటాషియం వాడాలన్నారు. వరి నాటే ముందు వేర్లను జీవన ఎరువుల మిశ్రమంలో 15 నుంచి 20 నిమిషాలు ఉంచి ఆ తర్వాత నాటు వేసుకోవాలన్నారు. వివిధ పంటల సాగుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సలహాలు, సూచనలు చేశారు. అలాగే ఎరువుల షాపులను తనిఖీ చేశారు. రైతులకు సరిపడా యూరియా వస్తుందని ఆందోళన చెందవద్దని ఆమె సూచించారు.
సేవాభావం అలవరుచుకోవాలి
వర్గల్(గజ్వేల్): విద్యార్థులు చదువుతోపాటు సామాజిక సేవాభావం అలవరుచుకోవాలని జాతీయ అవార్డు గ్రహీత, జిల్లా బాలల సంక్షేమ సమితి చైర్మన్ డాక్టర్ దేశబోయిని నర్సింహులు అన్నారు. వర్గల్ మండలం రాంసాగర్‌పల్లిలో శుక్రవారం గజ్వేల్ డిగ్రీ కళాశాల విద్యార్థుల ఎన్‌ఎస్‌ఎస్ క్యాంపులో సర్పంచ్ నాగరాజుతో కలిసి ఆయన పాల్గొని దిశానిర్దేశం చేశారు. జట్టుగా నిర్వహించే కార్యక్రమాలు నాయకత్వలక్షణాలు పెంపొందిస్తాయని, జీవన నైపుణ్యాలు మెరుగుపడతాయని అన్నారు. యువత వ్యసనాల బారిన పడి నిర్వీర్యం కావొద్దని, సన్మార్గంలో ముందుకుసాగాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగరాజు, ఉపసర్పంచ్ ప్రదీప్‌గౌడ్, ప్రోగ్రాం ఆఫీసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
‘ఇందూరు’లోక్యాంపస్ ప్లేస్‌మెంట్స్
టెక్ మహీంద్రాకు 27 మంది ఎంపిక
సిద్దిపేటఅర్బన్: పొన్నాలలోని ఇందూరు ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో 27 మంది విద్యార్థులు సర్వీస్ ఇంజినీర్ ఉద్యోగాలకు ఎంపికై నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వీపీ రాజు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన టెక్ మహీంద్రా ఆధ్వర్యంలో జరిగిన ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు 164 మంది పాల్గొన్నారు. వీరికి ఆన్‌లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, హెచ్‌ఆర్ ఇంటర్వ్యూలు నిర్వహించి 27 మందిని ఎంపిక చేశారు. ఎంపికై న వారికి సంవత్సరానికి రూ. 3.5 లక్షల వేతనం ఉంటుందని పేర్కొన్నారు.
సీఎం దిష్టిబొమ్మ దహనం
సిద్దిపేటరూరల్: మాజీముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడంపై నారాయణరావుపేట, సిద్దిపేటరూరల్ మండలాలకు చెందిన బీఆర్‌ఎస్ నాయకులు శుక్రవారం రహదారులపై రాస్తారోకోలు చేపట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర సాధనకు కృషి చేసిన కేసీఆర్‌పై క్షక్షపూరితంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఈ మేరకు కేసీఆర్ స్వగ్రామమైన చింతమడక గ్రామస్తులు, బీఆర్‌ఎస్ నాయకులు సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
విద్యార్థిసంఘాలకు
ఎన్నికలు నిర్వహించాలి
సిద్దిపేటకమాన్: విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఎన్నికలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సంఘాల జిల్లా అధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాస్‌రెడ్డి, కుమార్, ప్రణయ్ పాల్గొన్నారు.
సాగులో సస్యరక్షణ తప్పనిసరి
సాగులో సస్యరక్షణ తప్పనిసరి


