ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయండి
గజ్వేల్‌రూరల్: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని గజ్వేల్–ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌లోగల జీపీపీ ఆర్టీసీ డిపో ఎదుట పోస్టు కార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్నా ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినా ఫలితం లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ 300 మందికిపైగా కార్మికులు గవర్నర్‌కు పోస్టుకార్డులు పంపిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జీపీపీ ఆర్టీసీ డిపో జేఏసీ చైర్మన్ జక్కుల నర్సింహులు, కన్వీనర్ రాజయ్య, ప్రచార కార్యదర్శి బీఎస్‌రెడ్డి, మహిళా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
గవర్నర్‌కు పోస్టుకార్డులు పంపిన కార్మికులు


