ఈసారైనా మున్సిపల్ కై వసం అయ్యేనా?
జిల్లా నేతలతో మంత్రి కోమటిరెడ్డి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): రానున్న ఎన్నికల్లో సిద్దిపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం అవుతుందా?.. లేదా? అని పార్టీ జిల్లా నాయకులను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. సోమవారం నంగునూరు మండలం ఘనపురం వెళ్తున్న క్రమంలో సిద్దిపేట రంగధాంపల్లి చౌరస్తా వద్ద మంత్రికి నాయకులు ఘన స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి నాయకులతో మాట్లాడుతూ పార్టీ పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. మంత్రికి స్వాగతం పలికిన వారిలో ఓబీసీ సెల్ అధ్యక్షుడు డాక్టర్ సూర్యవర్మ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శివప్ప, గుండు రవితేజ ఉన్నారు.


