జెండావిష్కరణ చేసిన మంత్రి పొన్నం
హుస్నాబాద్: 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ జాతీయ జెండాను ఎగరవేశారు. అలాగే, బీఆర్‌ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సతీష్‌కుమార్ జెండాను ఆవిష్కరించారు. మున్సిపల్ కార్యాలయం, ఆర్టీఓ కార్యాలయం, వ్యవసాయ మార్కెట్ యార్డు ల్లో అధికారులు జెండా వందనం చేశారు. విద్యార్థులు తయారు చేసిన ఆపరేషన్ సింధూర్‌లో భాగమైన వివిధ రకాల రాకెట్స్‌లు, భారత వ్యోమగామిలను శకటాల రూపంలో ఏర్పాటు చేసి శోభాయాత్ర నిర్వహించారు.
బహుమతులు ప్రదానం
సిద్దిపేటకమాన్: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా సిద్దిపేట జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి సోమవారం జాతీయ జెండా ఆవిష్కరించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నేషనల్ గర్ల్ చైల్డ్ డేను పురస్కరించుకుని న్యాయ విద్యార్థులకు వ్యాసరచన, రీల్స్ మేకింగ్ పోటీలు నిర్వహించారు. ఇందులో విజేతలు నిలిచిన వారికి బహుమతులు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో అడిషనల్ డిస్ట్రిక్ సెషన్స్ జడ్జి జయప్రసాద్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎన్.సంతోష్‌కుమార్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సాధన, న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు, న్యాయసేవా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ నేతలతోనే
పట్టణాభివృద్ధి సాధ్యం
నియోజకవర్గ కన్వీనర్ సత్యనారాయణ
హుస్నాబాద్: గత ఎమ్మెల్యేలు దేశిని చిన్నమల్లయ్య, చాడ వెంకట్‌రెడ్డిల హయాంలోనే పట్టణ అభివృద్ధి జరిగిందని సీపీఐ నియోజకవర్గ కన్వీనర్ జాగీర్ సత్యనారాయణ అన్నారు. అనబేరి, సింగిరెడ్డి అమరుల భవన్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పేదలకు ఇళ్ల స్థలాలు, పక్కా ఇళ్లు, విద్యుత్ సౌకర్యం, ఎస్‌బీఐ బ్యాంక్, డిగ్రీ కళాశాలలు మంజూరు చేయించిన ఘనత వారికే దక్కిందని గుర్తుచేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో 20 వార్డుల్లోను తమ అభ్యర్థులను నిలిపేందుకు సన్నాహాలు చేస్తున్నామని, తమ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి మల్లేశ్, నాయకులు సంజీవరెడ్డి, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
జెండావిష్కరణ చేసిన మంత్రి పొన్నం
జెండావిష్కరణ చేసిన మంత్రి పొన్నం


