తపాస్‌పల్లికి గోదావరి జలాలు
కొమురవెల్లి(సిద్దిపేట): తపాస్‌పల్లి రిజర్వాయర్‌లోకి బుధవారం మాజీ ఎమ్మెల్యే, జనగామ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ప్రతాప్‌రెడ్డి చొరవతో ఇరిగేషన్ అధికారులు గోదావరి జలాలను విడుదల చేశారు. నీటి పంపింగ్ కోసం రెండు పైపు లైన్లు ఉండగా ప్రస్తుతం ఒక లైను నుంచి నీటిని విడుదల చేశారు. ధర్మసాగర్ నుంచి బొమ్మకూరు మీదుగా తపాస్‌పల్లి రిజర్వాయర్ కు నీరు చేరుతోంది. రిజర్వాయర్‌ను పూర్తి స్థాయిలో నింపిన అనంతరం చేర్యాల, కొమురవెల్లి మండలాల్లోని చెరువులు, కుంటలు నింపి యాసంగికి సాగు నీరు అందించనున్నట్లు అధికారులు తెలిపారు.


