అగ్నివీర్‌తో నాయకత్వ లక్షణాలు
● ఆసక్తిగల విద్యార్థులు దరఖాస్తు చేసుకోండి
● ఆర్మీ రిక్రూట్‌మెంట్ మెడికల్ అధికారి ప్రకాశ్‌చంద్రరాయ్
సిద్దిపేటఎడ్యుకేషన్: అగ్నివీర్‌గా దేశానికి సేవచేయడం ద్వారా క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని ఆర్మీ రిక్రూటింగ్ మెడికల్ ఆఫీసర్ మేజర్ ప్రకాశ్‌చంద్రరాయ్ అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల(కోఎడ్యుకేషన్)లో శుక్రవారం విద్యార్థులకు అగ్నివీర్ రిక్రూట్‌మెంట్‌పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత సైన్యంలో చేరాలనుకునే యువతకు అగ్నివీర్ ఒక్క చక్కని అవకాశమన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దళారులను నమ్మవద్దని సూచించారు. భవిష్యత్‌లో ఇతర ఉపాధి అవకాశాలకు ఇది దోహదపడుతుందని చెప్పారు. అగ్నిపథ్ పథకం కింద అగ్నివీర్‌గా ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ, అర్హతలు, శారీరక దృఢత్వ ప్రమాణాలు, వైద్యపరీక్షలు, శిక్షణ కాలం, విధులు, బాధ్యతల గురించి వివరించారు. అగ్నివీర్‌కు లభించే వేతనాలు, అలవెన్స్‌లు, బీమా, నాలుగేళ్లు పూర్తయ్యాక అందించే సేవానిధి తదితర అంశాల గురించి వివరించారు. ప్రిన్సిపాల్ సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ అర్హత, ఆసక్తిగల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలపై కళాశాల విద్యార్థులు ఇర్ఫాన్, సునీల్ రూపొందించిన ఉత్తమ షార్ట్‌ఫిల్మ్‌కు ట్రాఫిక్ అధికా రులు అందించిన సర్టిఫికెట్లను ఆయన చేతుల మీదుగా అందించారు. కార్యక్రమంలో కళాశాల స్టాఫ్ సెక్రటరీ సుధాకర్‌రెడ్డి, క్రమశిక్షణ కమిటీ చైర్మెన్ శ్రీనివాస్‌రెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి దరిపల్లి నగేశ్, స్పోర్ట్స్ ఇన్‌చార్జి అశోక్, అధ్యాపకులు రఘురాజ్, వెంకటరమణ, గంగాధర్, రాజ్యలక్ష్మి, రాజశేఖర్, నరేందర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, శ్రీకాంత్ సత్యం, ఫాతిమా, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
అగ్నివీర్‌తో నాయకత్వ లక్షణాలు


