ఆకట్టుకున్న
ప్రదర్శనలు
● అలరించిన శకటాలు, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ● స్టాళ్లను పరిశీలించిన కలెక్టర్ హైమావతి, సీపీ రష్మీ పెరుమాళ్ ● ఉత్తమ సేవలందించిన వారికి పురస్కారాల అందజేత
సిద్దిపేటకమాన్: జిల్లాలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సిద్దిపేట పోలీసు కమిషనరేట్ పరేడ్‌గ్రౌండ్‌లో సోమవారం నిర్వహించిన వేడుకలలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కలెక్టర్ కె.హైమావతి గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జిల్లా ప్రగతిపై ప్రసంగించారు. పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. స్వాతంత్ర సమరయోధులు వెంకటాచారి, పద్మను పోలీసు కమిషనర్ సాధన రష్మీ పెరుమాళ్‌తో కలిసి కలెక్టర్ హైమావతి సన్మానించారు.
ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన
వేడుకల్లో గృహ నిర్మాణ సంస్థ ఇందిరమ్మ ఇళ్లు, విద్యుత్‌శాఖ గృహజ్యోతి, ఆర్టీసీ మహాలక్ష్మీ పథకం, రవాణశాఖ రోడ్డు భద్రత, వ్యవసాయశాఖ, డీఆర్‌డీఓ, ఉద్యాన పట్టుపరిశ్రమ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, అటవీశాఖ, ఫైర్, ఫుడ్ అండ్ సేఫ్టీ, వైద్యారోగ్యశాఖ, లీడ్‌బ్యాంక్, క్రీడా శాఖ శకటాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పరేడ్ గ్రౌండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన పలు శాఖల స్టాళ్లను సీపీతో కలిసి కలెక్టర్ తిలకించారు. జిల్లాలోని వివిధశాఖల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించిన 181 మంది అధికారులు, సిబ్బందిని ప్రశంసాపత్రాలతో అభినందించారు.
జిల్లా కేంద్రానికి దూరంగా ఉండడంతో ఇబ్బందులు
పోలీసు కమిషనరేట్ జిల్లా కేంద్రానికి దూరంగా ఉండడంతో వేడుకల్లో అధికారులు, సిబ్బంది మాత్రమే పాల్గొన్నారు. సామన్య ప్రజలు మాత్రం హాజరు కాలేకపోయారు. వేడుకల్లో పాల్గొనడానికి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రైవేట్ ఆటోలలో పరిమితికి మించి తరలించారు. జిల్లా కేంద్రంలోనే వేడుకలు నిర్వ హించాలని పలువురు కోరుతున్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, ఏసీపీ రవీందర్‌రెడ్డి, సీఐలు వాసుదేవరావు, ఉపేందర్, లక్ష్మీబాబు, విద్యాసాగర్, శ్రీధర్‌గౌడ్, శ్రీను, లతీఫ్, ప్రవీణ్‌కుమార్, సైదా, రామకృష్ణ, ఆర్డీఓలు, తహాసీల్దార్ హరికిరణ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న
ఆకట్టుకున్న
ఆకట్టుకున్న
ఆకట్టుకున్న


