నిర్వాసితులకు ఇచ్చిన మాట ఏమాయె.. | - | Sakshi
Sakshi News home page

నిర్వాసితులకు ఇచ్చిన మాట ఏమాయె..

Jan 21 2026 8:42 AM | Updated on Jan 21 2026 8:42 AM

నిర్వాసితులకు ఇచ్చిన మాట ఏమాయె..

నిర్వాసితులకు ఇచ్చిన మాట ఏమాయె..

నిర్వాసితులకు ఇచ్చిన మాట ఏమాయె..

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌తో ఒరిగిందేమీలేదు

మున్సిపల్‌ ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సిందే

మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు

గజ్వేల్‌లో బీజేపీ‘విజయ సంకల్ప’ సమావేశం

గజ్వేల్‌: మల్లన్నసాగర్‌ నిర్వాసితులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాట మరిచిపోయారని మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు విమర్శించారు. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం గజ్వేల్‌లోని ప్రజ్ఞా గార్డెన్స్‌లో నిర్వహించిన ‘విజయ సంకల్ప’ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుమందు పట్టణంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి, ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల తీరుపై మండిపడ్డారు. దుబ్బాక నియోజకవర్గానికి చెందిన మల్లన్నసాగర్‌ ముంపు బాధితులను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గజ్వేల్‌కు తీసుకొచ్చి వారి సమస్యలను పట్టించుకోకుండా వదిలేసిందన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా.. కాంగ్రెస్‌ సైతం అదే బాటలో పయనిస్తున్నదని వాపోయారు. ఈ పార్టీల వల్ల ముంపు బాధితులకే కాదు.. మున్సిపాలిటీకి ఒరిగిందేమీ లేదన్నారు. గజ్వేల్‌ ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్‌ గడిచిన 13ఏళ్లల్లో అతి కొద్దిసార్లు మాత్రే వచ్చారని విమర్శించారు. ఆయన ఫామ్‌హౌస్‌కే పరిమితమైతే ఇక్కడి ప్రజల సమస్యలను ఎవరూ పరిష్కరిస్తారని ప్రశ్నించారు. రింగు రోడ్డు పూర్తి చేయకపోగా, పట్టణంలో డబుల్‌ బెడ్రూమ్‌ ఇండ్ల పంపిణీ ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉందన్నారు. ఈ రెండు పార్టీలకు మున్సిపల్‌ ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సిన అవసరముందన్నారు. సమావేశంలో పార్టీ మున్సిపల్‌ ఎన్నికల ఇన్‌చార్జి ఆకుల విజయ, జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్‌, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ గాడిపల్లి భాస్కర్‌, పార్టీ పట్టణ శాఖ అధ్యక్షుడు మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement