సీతక్కను కలిసిన కొమ్మూరి
చేర్యాల(సిద్దిపేట): రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్కను మంగళవారం జనగామ నియోజకవర్గ ఇన్‌చార్జి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలోని మున్సిపాలిటీల ఇన్‌చార్జిగా నియమితులైన సీతక్కను కలిసి జనగామ, చేర్యాల మున్సిపాలిటీల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఆయన వెంట చేర్యాలకు చెందిన సంజీవులున్నారు.
తపాస్ రాష్ట్ర
ఉపాధ్యక్షుడిగా తిరుపతి
నంగునూరు(సిద్దిపేట): తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రాజగోపాల్‌పేట ఉన్నత పాఠశాల ఉపాధ్యా యుడు బి.తిరుపతి నియమితులయ్యారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ప్రకటించారన్నారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన బాధ్యులకు ధన్యవాదాలు తెలిపారు. సంఘం బలోపేతానికి, ఉపాధ్యాయులు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.
బడుల బలోపేతంలో
ఉపాధ్యాయులే కీలకం
డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి
కొండపాక(గజ్వేల్): ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంలో ఉపాధ్యాయులు కీలకంగా వ్యవహరించాలని డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కుకునూరుపల్లిలో, మంగోల్‌లో ప్రాథమిక పాఠశాలను మంగళవారం సందర్శించారు. విద్యాబోధన తీరును విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ మూడవ తరగతికి నిర్వహించే ఎఫ్‌ఎల్‌ఎస్ కార్యక్రమంపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ బచ్చలి సత్తయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పట్టు రైతులకు రుణాలివ్వాలి
పట్టు పరిశ్రమ శాఖ
జిల్లా సంచాలకులు ఇంద్రసేనారెడ్డి
చిన్నకోడూరు(సిద్దిపేట): పట్టు సాగు చేస్తున్న రైతులకు పెట్టుబడి కోసం బ్యాంకు అధికారులు రుణాలు అందజేయాలని పట్టు పరిశ్రమ శాఖ జిల్లా సంచాలకులు ఇంద్రసేనారెడ్డి సూచించారు. జిల్లా నుంచి వచ్చిన యూనియన్ బ్యాంకు అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మంగళవారం మండలంలోని చంద్లాపూర్‌లోని పట్టు సాగును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర పంటలతో పోలిస్తే పట్టు సాగు లాభదాయకమన్నారు. ఏడాదికి 8 నుంచి 10 పంటలు తీయవచ్చన్నారు. మొదటగా షెడ్ నిర్మాణం, పంట సాగు, పనిముట్లు, ఇతర పరికరాల కోసం పెట్టుబడి భారమవుతున్నందున బ్యాంకు అధికారులు సహకరించి రుణాలు అందజేస్తే ఈ పంట సాగు చేయడానికి ఎక్కువ మంది రైతులు ముందుకు వస్తారన్నారు. రుణాలు ఇచ్చే విషయంలో సహకరిస్తామని బ్యాంకు అధికారులు స్పష్టం చేశారు. యూనియన్ బ్యాంకు జిల్లా మేనేజర్ హరిబాబు, నాబార్డు జిల్లా అధికారి నిఖిల్ రెడ్డి, అధికారులు, రైతులు పాల్గొన్నారు.
రష్మితను అభినందించిన సీపీ
సిద్దిపేటకమాన్: జూనియర్ నేషనల్ అర్చరీ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించిన హోంగార్డు కుమార్తె రష్మితరెడ్డిని మంగళవారం పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ అభినందించారు. తన కార్యాలయంలో సన్మానించారు. తెలంగాణ రాష్ట్రానికి గౌరవం తెచ్చిన రస్మిత, కోచ్ రవి శంకర్‌ను అభినందించారు.
సీతక్కను కలిసిన కొమ్మూరి
సీతక్కను కలిసిన కొమ్మూరి
సీతక్కను కలిసిన కొమ్మూరి


