పుర పోరు.. నామినేషన్ల జోరు
రెండో రోజు 187..
● ఇప్పటి వరకు 72 వార్డులకు 222 నామినేషన్ల స్వీకరణ
సాక్షి, సిద్దిపేట: మున్సిపల్ ఎన్నికలల్లో భాగంగా నామినేషన్ల స్వీకరణ కొనసాగుతోంది. రెండో రోజు గురువారం నాలుగు మున్సిపాలిటీలలో 72 వార్డులలో 187 నామినేషన్లు వచ్చాయి. మొత్తం ఇప్పటి వరకు 222 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల స్వీకరణ శుక్రవారంతో ముగియనుంది. సమయం తక్కువగా ఉండటంతో అభ్యర్థుల ఎంపికపై ప్రధాన పార్టీలు వేగం పెంచాయి. ఈ నేపథ్యంలో పురపాలికల్లో రాజకీయాలు వేడెక్కాయి.
ధీమాతో దాఖలు..
టికెట్ దక్కుతుందన్న ధీమాతో కొందరు, పార్టీ నుంచి ఆదేశాలు రావడంతో మరికొందరు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ముఖ్యనేతల ఆశీస్సులు ఉన్న వారు, అంతర్గతంగా అభయం దక్కిన వారు కేంద్రాలకు వచ్చి దరఖాస్తులను తీసుకెళ్తున్నారు. శుక్రవారం ఆయా పార్టీలు పూర్తిస్థాయిలో అభ్యర్థులు ఖరారయ్యే అవకాశం ఉంది.
టికెట్ కోసం టెన్షన్
టికెట్ దక్కుతుందో లేదోనని పలువురు ఆశావహులు టెన్షన్ పడుతున్నారు. నాలుగు మున్సిపాలిటీల్లో పలు చోట్ల పలు వార్డులకు సంబంధించి టికెట్లను ఖరారు చేయగా మరికొన్ని చోట్ల ఆశిస్తున్న వారు ఎక్కువగా ఉండటంతో వారితో చర్చలు జరిపి వారిని బుజ్జగిస్తున్నారు. పలు చోట్ల బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నుంచి టికెట్ దక్కకపోతే బీజేపీ నేతలను సంప్రదింపులు జరుపుతున్నారు.
ఇప్పటి వరకు వచ్చిన నామినేషన్లు ఇవే..
మున్సిపాలిటీ 28న 29న మొత్తం
హుస్నాబాద్ 04 26 30
గజ్వేల్ 08 68 76
దుబ్బాక 18 72 90
చేర్యాల 05 21 26


