రోడ్డు భద్రత నిబంధనలు తప్పనిసరి
సిద్దిపేటకమాన్: ప్రతి ఒక్క వాహనదారుడు ట్రాఫిక్, రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని ఏసీపీ రవీందర్‌రెడ్డి, రవాణ శాఖ అధికారి శంకర్ నారాయణ అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శనివారం పాఠశాలల విద్యార్థులు సిద్దిపేట పట్టణంలో చేపట్టిన సైకిల్ ర్యాలీకి ఏసీపీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రహదారి ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలన్నారు. మైనర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపకూడదన్నారు. అనంతరం పిల్లలతో రహదారి భద్రత ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో వన్ టౌన్ సీఐ వాసుదేవరావు, అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్‌రెడ్డి, పోలీసు, రవాణశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
ఏసీపీ రవీందర్‌రెడ్డి, రవాణ శాఖ అధికారి శంకర్ నారాయణ


