రక్తదానంతో ప్రాణాలు కాపాడుదాం | - | Sakshi
Sakshi News home page

రక్తదానంతో ప్రాణాలు కాపాడుదాం

Jan 24 2026 9:36 AM | Updated on Jan 24 2026 9:36 AM

రక్తద

రక్తదానంతో ప్రాణాలు కాపాడుదాం

ఎమ్మెల్సీ డాక్టర్‌ యాదవరెడ్డి

గజ్వేల్‌రూరల్‌: రక్తదానంతో అత్యవసర సమయాల్లో విలువైన ప్రాణాలను కాపాడవచ్చని ఎమ్మెల్సీ డాక్టర్‌ యాదవరెడ్డి అన్నారు. ఆపన్నహస్త మిత్రబృందం ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి సందర్భంగా శుక్రవారం పట్టణంలోని ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌లో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ రక్తాన్ని దానం వల్ల అత్యవసర పరిస్థితుల్లో ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపినట్లవుతుందన్నారు. శిబిరంలో రెడ్‌క్రాస్‌ బ్లడ్‌బ్యాంక్‌ సహకారంతో 277 యూనిట్ల రక్తాన్ని తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారి కోసం రక్తదానం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ నరేందర్‌రెడ్డి, మాజీ చైర్మన్‌ మాదాసు శ్రీనివాస్‌, ఆపన్నహస్త మిత్రబృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

పుస్తక పఠనం ఎంతో మేలు

జిల్లా విద్యాధికారి శ్రీనివాస్‌రెడ్డి

ములుగు(గజ్వేల్‌): గ్రంథాలయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాధికారి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ములుగు మండలం క్షీరసాగర్‌ మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో రూమ్‌ టు రీడ్‌ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లైబ్రరీని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుంచే పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. విద్యార్థులు విజ్ఞానాన్ని పెంచుకుని భవిష్యత్తులో ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి ఉదయ్‌భాస్కర్‌రెడ్డి, సర్పంచ్‌ కొన్యాల బాల్‌రెడ్డి, పాఠశాల హెచ్‌ఎం గీత తదితరులు పాల్గొన్నారు.

పంటలు పరిశీలించిన

వ్యవసాయ శాస్త్రవేత్తలు

సిద్దిపేటరూరల్‌: రాజేంద్రనగర్‌కు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు శుక్రవారం పలు పంటలను పరిశీలించారు. బుస్సాపూర్‌లో మొక్కజొన్న పంటను పరిశీలించి రైతులకు సూచనలు చేశారు. పంటకు కత్తెర పురుగు ఆశించినందున నివారణకు ఇమామెక్టిన్‌ బెంజోయేట్‌ మందును 80గ్రాములు, లీటర్‌ వేప నూనె కలిపి ఎకరానికి పిచికారీ చేయాలన్నారు. వ్యవసాయ ప్రధాన శాస్త్రవేత్తలు చంద్రమోహన్‌, భద్రు, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయండి

హుస్నాబాద్‌రూరల్‌: మహిళా గ్రామైక్య భవనాల పనులను సర్పంచ్‌లు త్వరగా పూర్తి చేయాలని ఏపీఎం తిరుపతి అన్నారు. శుక్రవారం మహ్మదాపూర్‌, రాములపల్లి గ్రామాల్లో గ్రామైక్య సంఘాల భవనాల పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు. ప్రభుత్వం మహిళల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తున్నదని, వ్యాపారంలో ప్రోత్సహించడానికి వడ్డీ లేని రుణాలను సైతం అందిస్తోందన్నారు. మహిళలు స్వయం ఉపాధి పొంది పలువురికి ఆదర్శంగా నిలవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు తిరుమల, పద్మలు పాల్గొన్నారు.

రక్తదానంతో ప్రాణాలు కాపాడుదాం1
1/2

రక్తదానంతో ప్రాణాలు కాపాడుదాం

రక్తదానంతో ప్రాణాలు కాపాడుదాం2
2/2

రక్తదానంతో ప్రాణాలు కాపాడుదాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement