మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి | - | Sakshi
Sakshi News home page

మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి

Jan 21 2026 8:42 AM | Updated on Jan 21 2026 8:42 AM

మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి

మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి

మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి

కలెక్టర్‌ హైమావతి

మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ

దుబ్బాక: ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్‌ హైమావతి సూచించారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ పథకాలు చేపడుతోందని తెలిపారు. మంగళవారం దుబ్బాక పట్టణంలోని ఐఓసీలో ఇందరామహిళ శక్తి సంబరాల్లో భాగంగా మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాలో 26 వేల కొత్త రేషన్‌కార్డులు ఇవ్వడమే కాకుండా పాత రేషన్‌ కార్డుల్లో 79 వేల పేర్లను అదనంగా చేర్చి లబ్ధి చేకూర్చినట్లు తెలిపారు. ఉచిత బస్సుతో పాటు మహిళల పేరిటనే ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చినట్లు చెప్పారు. దుబ్బాక పట్టణంలో 11,105 చీరలను పంపిణీ చేస్తున్నామన్నారు. రూ.1.26 కోట్ల వడ్డీలేని రుణాలు ఆయా మహిళా గ్రూపులకు అందించామన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ సదానందం, దుబ్బాక ఏఎంసీ చైర్మన్‌ కొంగర రవి, అదనపు ఆర్డీఓ సుధీర్‌, మెప్మా పీడీ హన్మంతరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ రమేష్‌కుమార్‌,తహసీల్దార్‌ సంజీవ్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.

అభ్యున్నతికి కృషి

చేర్యాల(సిద్దిపేట): మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని కలెక్టర్‌ హైమావతి అన్నారు. స్థానిక కల్యాణి గార్డెన్‌లో మంగళవారం నిర్వహించిన ఇందిరా మహిళ శక్తి సంబరాల్లో పాల్గొన్న ఆమె.. పట్టణ పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు, ఇందిరమ్మ చీరలు అందజేశారు.

పథకాలు సద్వినియోగం చేసుకోండి

గజ్వేల్‌: ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా మహిళలు ఉన్నతస్థాయికి చేరుకోవాలని కలెక్టర్‌ హైమావతి ఆకాంక్షించారు. మంగళవారం గజ్వేల్‌లోని ఇంటిగ్రేటెడ్‌ ఆఫీస్‌ కాంప్లెక్స్‌(ఐఓసీ)లో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 3500 ఇందిరమ్మ ఇళ్లు గజ్వేల్‌ నియోజకవర్గానికి మంజూరు చేసినట్లుచెప్పారు. ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతున్నదని వివరించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ జయదేవ్‌ ఆర్య, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నరేందర్‌రెడ్డి, మెప్మా ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ హన్మంతరెడ్డి, తహసీల్దార్‌ శ్రావన్‌కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement