నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నాం | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నాం

Jan 21 2026 8:42 AM | Updated on Jan 21 2026 8:42 AM

నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నాం

నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నాం

నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నాం ● వినియోగదారుల సమస్యల పరిష్కారమే లక్ష్యం ● ఎస్‌ఈ చంద్రశేఖర్‌

● వినియోగదారుల సమస్యల పరిష్కారమే లక్ష్యం ● ఎస్‌ఈ చంద్రశేఖర్‌

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడమే లక్ష్యంగా అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని సమస్యల పరిష్కార వేదిక సభ్యులు తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని విద్యుత్‌ భవన్‌లో విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక సభ్యులు రామానుజ నాయక్‌, వెంకట్‌, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ చంద్రశేఖర్‌ దరఖాస్తులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 77 మంది వినియోగదారులు తమ విన్నపాలను అధికారులకు అందించారు. ఇందులో అధికంగా నూతన విద్యుత్‌ స్తంభాలు, విద్యుత్‌ లైన్ల మార్పిడి, బిల్డింగ్‌లపై నుంచి వెళ్తున్న విద్యుత్‌ లైన్‌ల తొలగింపు, నూతన విద్యుత్‌ కనెక్షన్లకు సంబంధించిన దరఖాస్తులు వచ్చాయి. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌తో పాటు, ఎలాంటి అవాంతరాలు లేకుండా సరఫరా చేస్తున్నామన్నారు. జిల్లాలో గృహజ్యోతి పథకంలో అర్హులైన లబ్ధిదారులకు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నట్లు తెలిపారు. విద్యుత్‌ వినియోగదారులకు ఎలాంటి సమస్యలు ఉన్న నేరుగా జిల్లా, డివిజన్‌, మండల స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఈలు శ్రీనాథ్‌, రాంచంద్రయ్య, భానుప్రకాశ్‌, కృష్ణయ్య, ఏడీ కమర్షియల్‌ ముత్తయ్య, ఏఈలు శ్వేత, ప్రియాంక, విద్యుత్‌శాఖ సిబ్బంది చందు, సాయి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement