రేపటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
● ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ● రెండు విడుతలుగా పరీక్షలు ● హాజరు కానున్న 9,710 మంది విద్యార్థులు
సిద్దిపేటఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ సైన్స్, ఒకేషనల్ విద్యార్థులకు సోమవారం నుంచి ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంఽధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ప్రభుత్వం ఈసారి అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు అవసరమైన ప్రయోగ పరికరాలను ఇప్పటికే అందించింది. ప్రాక్టికల్ పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్‌ల (సీఎస్)లకు శనివారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల (కోఎడ్యుకేషన్)లో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అవసరమైన సూచనలు, సలహాలను అందించారు.
జిల్లాలో 59 పరీక్షా కేంద్రాలు
జిల్లాలో ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు గాను 59 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక సీఎస్‌ను నియమించారు. రెండు విడతలుగా నిర్వహించనున్న ఈ పరీక్షలకు జనరల్ కోర్సులకు సంబంధించి 4,965 మంది విద్యార్థు లు, ఒకేషనల్ ప్రథమ సంవత్సరం 2,556, ద్వితీ య సంవత్సరం 2,189 మొత్తం 9,710 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. మొద టి విడత ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ప్రారంభం కానుండగా.. రెండవ విడత 7 నుంచి ప్రారంభం కానుంది. మొదటి విడతలో 39 పరీక్షా కేంద్రాలకు విద్యార్థులను కేటాయించారు. ఇందుకు సంబంధించి విద్యార్థులకు హాల్‌టికెట్ల పంపిణీ పూర్తయింది.


