మల్లన్న బండ.. జనం నిండా
జాతరలో భక్తజన సందోహం, (ఇన్‌సెట్‌లో) బండ్ల ఊరేగింపు
అక్బర్‌పేట–భూంపల్లి మండలం వీరారెడ్డిపల్లి, జంగపల్లి శివారులో వెలిసిన మల్లన్న బండపై జరిగిన జాతరకు జనం పోటెత్తారు. మల్లన్న స్వామి వారిని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. బండ్ల బోనాలతో స్వామి వారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. జాతరలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.
– మిరుదొడ్డి(దుబ్బాక)
మల్లన్న బండ.. జనం నిండా


