అభివృద్ధికి బాటలు వేస్తాం | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధికి బాటలు వేస్తాం

Jan 24 2026 9:36 AM | Updated on Jan 24 2026 9:36 AM

అభివృ

అభివృద్ధికి బాటలు వేస్తాం

సర్పంచ్‌ల స్పష్టీకరణ ముగిసిన మొదటి దశ శిక్షణ

సిద్దిపేటఅర్బన్‌: పల్లెల అభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తామని సర్పంచ్‌లు అన్నారు. పంచాయతీ రాజ్‌ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో నూతనంగా గెలుపొందిన సర్పంచ్‌లకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మొదటి దశలో కోహెడ, కొమురవెల్లి, నారాయణరావుపేట, చిన్నకోడూరు, దుబ్బాక మండలాలకు చెందిన 98 మంది సర్పంచులకు 5 రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. శిక్షణకు హాజరైన సర్పంచ్‌లను శుక్రవారం ‘సాక్షి’ పలకరించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శిక్షణ ఎంతగానో దోహదం చేస్తుందన్నారు. పంచాయతీ రాజ్‌ చట్టం గురించి క్షుణ్ణంగా వివరించారని, గ్రామాన్ని అభివృద్ది చేసుకోవడానికి అవసరమైన నిధులను ఎలా సమీకరించుకోవాలి? నిధులను ఎలా ఖర్చు చేయాలి? అనే అంశాలపై సంపూర్ణ అవగాహన కలిగిందని వారు అన్నారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను పరిపాలనలో ఉపయోగించి తమ గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.

మహిళా సాధికారతకు కృషి

గ్రామంలోని మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేందుకు కృషి చేస్తా. గ్రామ సభ ఆదర్శంగా ఉండేలా నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తా. వీధి లైట్ల అన్నింటిని సోలార్‌ విద్యుత్‌తో నడిచేలా మారుస్తాం.

– ఆకుల స్వప్న, సర్పంచ్‌, గుర్రాలగొంది

పాలనపై పట్టు పెరిగింది

శిక్షణలో తెలిసిన అంశాలతో గ్రామ పాలనపై పట్టుపెరిగింది. గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పని చేస్తా.

– సురగోని శేఖర్‌,

సర్పంచ్‌, చంద్లాపూర్‌

అభివృద్ధికి బాటలు వేస్తాం 1
1/2

అభివృద్ధికి బాటలు వేస్తాం

అభివృద్ధికి బాటలు వేస్తాం 2
2/2

అభివృద్ధికి బాటలు వేస్తాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement