ప్రాక్టికల్స్‌కు హాజరు తప్పనిసరి
సిద్దిపేటఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ విద్యార్థులు తప్పనిసరిగా ప్రాక్టికల్ పరీక్షలను రాయాలని, గైర్హాజరైతే ఫెయిల్‌గా పరిగణిస్తారని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవీందర్‌రెడ్డి చెప్పారు. బుధవారం ప్రారంభం అయిన ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్షలను ఆయన పర్యవేక్షించారు. పట్టణంలోని దీక్ష కళాశాల, న్యూజనరేషన్, ప్రభుత్వ జూనియర్ కళాశాల(కోఎడ్యుకేషన్)లలో జరుగుతున్న ప్రాక్టికల్స్‌ను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువారం సెకండియర్ విద్యార్థులకు ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్ష ఉంటుందని, 23న మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఉంటుందని, 24న ప్రథమ సంవత్సరం విద్యార్థులకు పర్యావరణ విద్య పరీక్ష ఉంటుందని చెప్పారు.జిల్లా వ్యాప్తంగా ఇంగ్లిష్ ప్రాక్టికల్స్‌కు 9,946 మంది ఫస్టియర్ విద్యార్థులకు 99శాతం మంది హాజరైనట్లు చెప్పారు.
డీఐఈఓ రవీందర్‌రెడ్డి


