సెటిల్మెంట్లు అందక ఇబ్బందులు | - | Sakshi
Sakshi News home page

సెటిల్మెంట్లు అందక ఇబ్బందులు

Jan 18 2026 9:06 AM | Updated on Jan 18 2026 9:06 AM

సెటిల్మెంట్లు అందక ఇబ్బందులు

సెటిల్మెంట్లు అందక ఇబ్బందులు

రిటైర్డ్‌ ఆర్టీసీ ఉద్యోగుల నిరసన

రిటైర్డ్‌ ఆర్టీసీ ఉద్యోగుల నిరసన

హుస్నాబాద్‌: సెటిల్మెంట్లు సకాలంలో అందక ఇబ్బందులు పడుతున్నామని రిటైర్డ్‌ ఆర్టీసీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలోని డిపో గేట్‌ వద్ద శనివారం వారు నిరసన తెలిపారు. అనంతరం డిపో మేనేజర్‌ వెంకన్నకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ తాము పదివీవిరమణ పొందిన తర్వాత 2017 నుంచి ఇప్పటి వరకు సెటిల్మెంట్లు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. గ్రాట్యుటీ, లీవ్‌ ఎన్కాస్మెంట్‌ లాంటి డబ్బులు ఇంత వరకు చెల్లించలేదని వాపోయారు. పిల్లల పెళ్లిళ్లు, చదువులు, అనారోగ్య కారణాల వల్ల చేసిన అప్పులు తీరక మానసిక వేదనకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తాము జీవించి ఉండగానే బకాయిలు చెల్లించి పెన్షన్‌లోని ఇబ్బందులు తొలగించాలని కోరారు. కార్యక్రమంలో రిటైర్డ్‌ ఉద్యోగులు శంకర్‌, కనకయ్య, రాములు, సత్తయ్య, పరమేశ్వర్‌, మైసయ్య, మల్లేశం, శ్రీని వాస్‌గౌడ్‌, రాజిరెడ్డి, ఎంటీ రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement