శనివారం శ్రీ 24 శ్రీ జనవరి శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

శనివారం శ్రీ 24 శ్రీ జనవరి శ్రీ 2026

Jan 24 2026 9:36 AM | Updated on Jan 24 2026 9:36 AM

శనివా

శనివారం శ్రీ 24 శ్రీ జనవరి శ్రీ 2026

శనివారం శ్రీ 24 శ్రీ జనవరి శ్రీ 2026

న్యూస్‌రీల్‌

విద్యాధరి.. అక్షర ఝరి

వర్గల్‌(గజ్వేల్‌): స్వర్ణకిరీటాది సర్వాభరణాలతో విద్యాసరస్వతిదేవి దర్శనం.. పోటెత్తిన భక్తజనం.. చిన్నారుల అక్షరాభ్యాసాలు.. అభిషేకాలు, అర్చనలు, పారాయణాలు, పుష్పార్చనలతో వర్గల్‌ క్షేత్రం వసంతోత్సవ సిరితో అలరారింది. శుక్రవారం వసంత పంచమి మహోత్సవం సందర్భంగా తెల్లవారుజామున పుష్పగిరి పీఠాధిపతి అమ్మవారి విశేషాభిషేకం నిర్వహించగా, చంద్రశేఖర సిద్ధాంతి పర్యవేక్షణలో అర్చక పరివారం సరస్వతిమాతకు లక్ష పుష్పార్చన, చెప్పన్‌భోగ్‌ మహా నివేదనాది పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సకల విద్యలకు మూలమైన విద్యాసరస్వతి అమ్మవారు స్వర్ణ కిరీటాది విశేషాభరణాలతో దివ్యదర్శనమిచ్చారు.

ప్రముఖుల సందర్శన

వర్గల్‌ క్షేత్రాన్ని ఎమ్మెల్సీ యాదవరెడ్డి, కలెక్టర్‌ హైమావతి, సీపీ రశ్మీ పెరుమాళ్‌, ఏసీపీ నర్సింహులు, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు తదితరులు సందర్శించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. దాదాపు 60వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, 6వేల వరకు చిన్నారుల అక్షరాభ్యాసాలు జరిగాయి. రోజంతా క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది.

కలెక్టర్‌ ప్రత్యేక పూజలు

చిన్నకోడూరు(సిద్దిపేట): మండల పరిధిలోని అనంతసాగర్‌ సరస్వతీ క్షేత్రం శుక్రవారం భక్తులతో కిటకిటలాడింది. ఆలయంలో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసాలు చేయించారు. కలెక్టర్‌ హైమావతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు. ఆలయ వార్షికోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అమ్మవారి నామస్మరణతో క్షేత్రం మార్మోగింది.

వర్గల్‌ క్షేత్రంలో వసంతోత్సవ సిరి

దేవీనామంతో మార్మోగిన శంభుగిరులు

వెల్లువగా చిన్నారుల అక్షరాభ్యాసాలు

పోటెత్తిన భక్తులు

శనివారం శ్రీ 24 శ్రీ జనవరి శ్రీ 20261
1/5

శనివారం శ్రీ 24 శ్రీ జనవరి శ్రీ 2026

శనివారం శ్రీ 24 శ్రీ జనవరి శ్రీ 20262
2/5

శనివారం శ్రీ 24 శ్రీ జనవరి శ్రీ 2026

శనివారం శ్రీ 24 శ్రీ జనవరి శ్రీ 20263
3/5

శనివారం శ్రీ 24 శ్రీ జనవరి శ్రీ 2026

శనివారం శ్రీ 24 శ్రీ జనవరి శ్రీ 20264
4/5

శనివారం శ్రీ 24 శ్రీ జనవరి శ్రీ 2026

శనివారం శ్రీ 24 శ్రీ జనవరి శ్రీ 20265
5/5

శనివారం శ్రీ 24 శ్రీ జనవరి శ్రీ 2026

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement