‘పుర’
న్యూస్‌రీల్
బుధవారం శ్రీ 28 శ్రీ జనవరి శ్రీ 2026
సమరం
మోగిన మున్సిపల్ ఎన్నికల నగారా
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. గతేడాది నుంచి ప్రత్యేక పాలనలో మున్సిపాలిటీలు కొనసాగుతున్నాయి. జిల్లాలోని గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటీ ఎన్నికలకుసంబంధించి షెడ్యూల్ విడుదలైంది. ఇప్పటికే నాలుగు మున్సిపాలిటీల చైర్మన్లు, 72 వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఓటరు తుది జాబితాను ఈ నెల 12న ప్రకటించిన విషయం తెలిసిందే. బుధవారం నుంచి ఆయా మున్సిపాలిటీలలో నామినేషన్లను స్వీకరించనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూరి చేశారు. – సాక్షి, సిద్దిపేట


