ప్రతిపక్ష పార్టీలు సహకరించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతిపక్ష పార్టీలు సహకరించాలి

Nov 29 2026 11:47 AM | Updated on Nov 29 2026 11:47 AM

ఎంపీ రఘునందన్‌రావు

దుబ్బాక రూరల్‌: నియోజకవర్గాల పునర్విభజన, మహిళ రిజర్వేషన్‌ బిల్లులకు ప్రతి పక్ష పా

ర్టీలు మద్దతివ్వాలని ఎంపీ రఘునందన్‌రావు పిలుపునిచ్చారు. ఈ రెండు బిల్లుల కోసం దేశప్రజలు ఎదురుచూస్తున్నారని ఆయన తెలిపారు. మండలంలోని రామక్కపేట, గోసాన్‌పల్లి, చీకోడ్‌, అప్పనపల్లి గ్రామాల్లో ఎంపీ రఘునందన్‌రావు ప్రారంభోత్సవాలు, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ...మహిళా బిల్లుకు ప్రతిపక్షాలు మద్దతివ్వకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతాయన్నారు. గతంలో మహిళ బిల్లుకు ప్రతి పక్ష పార్టిలు అడ్డుపడ్డాయని, బిల్లును గెలిపిస్తే వారికే క్రెడిట్‌ దక్కుతుందని ప్రధాని నరేంద్రమోదీ ఆనాడే తెలిపారని గుర్తు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement