తిరుపతి జిల్లా: కూటమి నేతల అరాచకాలు, దాడులు పంచాయతీ ఎన్నికల్లోనూ కొనసాగుతున్నాయి. తిరుపతి జిల్లా చంద్రగిరి పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ నాయకుకలు దౌర్జన్యం చేశారు. చంద్రగిరి సాక్షి పత్రిక రిపోర్టర్ నరేష్ కుమార్‌రెడ్డిపై టీడీపీ గూండాలు దాడి చేశారు. సెల్‌ఫోన్ లాక్కొని నరేష్‌కుమార్‌రెడ్డిపై దాడి చేశారు
పోలీసుల సమక్షంలోనే టీడీపీ గూండాలు దాడి చేయడంతో కూటమి పాలన అరాచకానికి అద్దం పడుతోంది. దీనిపై సాక్షి రిపోర్టర్ నరేష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా ప్రతినిధులుగా తామొస్తే ఎందుకు దాడి చేస్తారంటూ మండిపడ్డారు. అనుమతి ఉంది కాబట్టే వచ్చామని, రావొద్దని చెబితే వచ్చే వాళ్లం కాదు కదా అంటూ ప్రశ్నించారు. రక్తాలు వచ్చేలా కొడతారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: వైఎస్సార్ జిల్లాలో టీడీపీ-జనసేన మధ్య రచ్చకెక్కిన విభేదాలు


